కొలెస్ట్రాల్ ను తగ్గించే లెమన్ గ్రాస్.. ఇంతకీ ఎలా తీసుకోవాలి..?

ఇటీవల కాలంలో అధిక కొలెస్ట్రాల్ తో బాధపడుతూ గుండె జబ్బుల బారిన పడుతున్న వారి సంఖ్య అంతకంతకు పెరిగిపోతోంది.

అయితే రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ను( Bad Cholestrol ) కరిగించడానికి కొన్ని కొన్ని ఆహారాలు ఎంతో ఉత్తమంగా సహాయపడతాయి.

లెమన్ గ్రాస్( Lemongrass ) కూడా ఆ కోవకే చెందుతుంది.ముఖ్యంగా లెమన్ గ్రాస్ తో నిత్యం టీ తయారు చేసుకుని తీసుకుంటే కొలెస్ట్రాల్ కరగడమే కాదు మరెన్నో హెల్త్ బెనిఫిట్స్ మీ సొంతం అవుతాయి.

టీ తయారీ కోసం.స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.

వాటర్ హీట్ అయ్యాక అందులో గుప్పెడు సన్నగా తరిగిన లెమన్ గ్రాస్ వేసుకోవాలి.

అలాగే హాఫ్ టీ స్పూన్ అల్లం తురుము( Ginger ) కూడా వేసి పది నిమిషాల పాటు మరిగించాలి.

దాంతో మన లెమన్ గ్రాస్ టీ( Lemongrass Tea ) అనేది రెడీ అవుతుంది.

స్టవ్ ఆపి టీ ను ఫిల్టర్ చేసుకుని వేడివేడిగా తాగవచ్చు.లేదా పూర్తిగా చల్లారిన తర్వాత కూడా తాగవచ్చు.

"""/" / లెమన్ గ్రాస్ టీ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవ‌డం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది.

లెమ‌న్ గ్రాస్ టీను క్ర‌మం త‌ప్ప‌కుండా తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్తంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి.

దాంతో గుండెకు ముప్పు కూడా త‌గ్గుతుంది.అలాగే ఒత్తిడి, ఆందోళ‌న వంటి మాన‌సిక స‌మ‌స్య‌ల‌ను అధిగ‌మించ‌డానికి లెమ‌న్ గ్రాస్ టీ అద్భుతంగా తోడ్ప‌డుతుంది.

ఈ టీ మైండ్ ను రిఫ్రెష్ చేస్తుంది. """/" / లెమన్ గ్రాస్ టీ జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది.

కడుపు నొప్పి, క‌డుపు ఉబ్బ‌రం వంటి స‌మ‌స్య‌ల నుంచి రిలీఫ్ ను అందిస్తుంది.

లెమన్ గ్రాస్ టీ కాలేయం, మూత్రపిండాలు, జీర్ణాశయం మరియు మూత్రాశయం నుండి టాక్సిన్స్ ను బయటకు పంపడంలో సహాయపడుతుంది.

ఆర్థరైటిస్ తో బాధ‌ప‌డుతున్న వారికి లెమ‌న్ గ్రాస్ టీ మంచి ఎంపిక అవుతుంది.

నిత్యం ఈ టీ తాగితే ఆర్థరైటిస్ నొప్పిని నిర్వహించడానికి హెల్ప్ చేస్తుంది.

వైరల్ వీడియో: ఏనుగుకు తిక్క రేగితే ఇలాగే ఉంటుంది మరి