చుండ్రును నివారించే నిమ్మ తొక్కలు.. ఎలా వాడాలో తెలుసా?
TeluguStop.com
చుండ్రు సమస్య( Dandruff )తో తీవ్రంగా సతమతం అవుతున్నారా? ఎన్ని ప్రయత్నాలు, ప్రయోగాలు చేసిన చుండ్రు పోవడం లేదా? చుండ్రు కారణంగా జుట్టు విపరీతంగా ఊడటం, తలలో దురద వంటి సమస్యలు వేధిస్తున్నాయా? అయితే వర్రీ వద్దు.
చుండ్రును నివారించడానికి నిమ్మ తొక్కలు( Lemon Peels ) చాలా అద్భుతంగా సహాయపడతాయి.
నిమ్మ తొక్కలను ఇప్పుడు చెప్పబోయే విధంగా ఉపయోగిస్తే ఎలాంటి చుండ్రు అయినా దెబ్బకు మాయం అవుతుంది.
మరి ఇంకెందుకు ఆలస్యం చుండ్రును నివారించుకునేందుకు నిమ్మ తొక్కలను ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం పదండి.
"""/" /
ముందుగా నాలుగు లేదా ఐదు నిమ్మ పండ్లు తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి.
వాటికి ఉండే తొక్కను సపరేట్ చేయాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒకటిన్నర గ్లాసుల వాటర్ పోయాలి.
వాటర్ హీట్ అవ్వగానే అందులో నిమ్మ తొక్కలు వేసి కనీసం పదిహేను నిమిషాల పాటు ఉడికించాలి.
ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఉడికించిన నిమ్మ తొక్కలను వాటర్ తో సహా మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.
ఈ జ్యూస్ లో ఒక కప్పు రోజ్ వాటర్, నాలుగు చుక్కలు లెమన్ ఎసెన్షియల్ ఆయిల్( Lemon Essential Oil ), వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ వేసి బాగా మిక్స్ చేస్తే హెయిర్ టోనర్ సిద్ధం అవుతుంది.
ఈ హెయిర్ టోనర్ ను ఒక స్ప్రే బాటిల్ లో నింపుకోవాలి.ఆపై స్కాల్ప్ కు తయారు చేసుకున్న హెయిర్ టోనర్ ను ఒకటికి రెండుసార్లు స్ప్రే చేసుకోవాలి.
"""/" /
రెండు గంటల అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి తల స్నానం చేయాలి.
వారానికి రెండు సార్లు ఈ విధంగా చేస్తే చుండ్రు దెబ్బకు పరార్ అవుతుంది.
అలాగే ఈ రెమెడీని తరచూ పాటిస్తే చుండ్రు మళ్ళీ మళ్ళీ రాకుండా కూడా ఉంటుంది.
స్కాల్ప్ శుభ్రంగా ఆరోగ్యంగా మారుతుంది.పైగా నిమ్మ తొక్కలతో పైన చెప్పిన విధంగా హెయిర్ టోనర్( Hair Toner ) ను తయారు చేసుకుని వాడటం వల్ల జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పెరుగుతుంది.
మరియు కురుల నుండి మంచి సువాసన సైతం వస్తుంది.
ఇదేం కాంప్లిమెంట్ రా బాబోయ్.. పొగిడినట్టే పొగిడి భారతీయులను అవమానించిన ఆస్ట్రేలియా కపుల్..