నిమ్మ తొక్కలతో ఇలా చేస్తే.. ముఖంపై నల్ల మచ్చలు దూరం!
TeluguStop.com
ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే నిమ్మ కాయలను మనం విరి విరిగా ఉపయోగిస్తాం.
బరువు తగ్గేందుకు ఉదయాన్నే వేడి నీటిలో నిమ్మ రసం కలుపుకుని తాగేవారు ఎందరో ఉన్నాయి.
అలాగే కూరల్లో రుచి కోసం కూడా నిమ్మ కాయలను వాడుతుంటాం.అయితే నిమ్మ కాయల విషయంలో చాలా మంది చేసే పొరపాటు తొక్కలను పారేస్తుంటారు.
కానీ, నిమ్మ తొక్కలు మనకు ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయి.ముఖ్యంగా ముఖంపై నల్ల మచ్చలను, మొటిమలను తగ్గించి.
ప్రకాశవంతంగా చేయడంలో గ్రేట్‌గా సహాయపడతాయి.మరి ఇంతకీ నిమ్మ తొక్కలను సౌందర్య పరంగా ఎలా ఉపయోగించాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా నిమ్మ తొక్కలను బాగా ఎండబెట్టి మొత్తగా పొడి చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో ఒక స్పూన్ నిమ్మ తొక్కల పొడి మరియు ఒక స్పూన్ పెరుగు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి.ఇరవై నిమిషాల తర్వాత క్లీన్ చేసుకోవాలి.
ఇలా వారానికి రెండు లేదా మూడు సార్లు చేయడం వల్ల ముఖం నల్ల మచ్చలు మరియు ముడతలు పోయి యవ్వనంగా మారుతుంది.
"""/"/
రెండొవది.ఒక ఒక బౌల్ తీసుకుని అందులో ఒక స్పూన్ నిమ్మ తొక్కల పొడి, అర స్పూన్ తేనె, కొద్దిగా నిమ్మరసం వేసి కలుపుకోవాలి.
ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి.అర గంట తర్వాత శుభ్రం చేసుకోవాలి.
ఇలా వారానికి మూడు సార్లు చేయడం వల్ల ముఖం మొటిమలు పోయి.కాంతివంతంగా మారుతుంది.
మూడోవది.ఒక ఒక బౌల్ తీసుకుని అందులో ఎండబెట్టిన నిమ్మ తొక్కల పొడి, చదనం పొడి మరియు పాలు వేసి మిక్స్ చేసువాలి.
ఈ మిశ్రమాన్ని ముఖానికి మాస్క్‌లా వేసుకుని.పదిహేను నిమిషాల పాటు వదిలేయాలి.