మధుమేహాన్ని అదుపు చేసే నిమ్మ తొక్కలు..ఎలా తీసుకోవాలంటే?
TeluguStop.com
మధుమేహం.దీనినే చాలా మంది షుగర్ వ్యాధి అని కూడా పిలుస్తుంటారు.
రక్తంలో చక్కెర స్థాయిలు ఉండాల్సిన దాని కంటే ఎక్కువగా పెరిగినప్పుడు మధుమేహం బారిన పడతారు.
దీర్ఘకాలిక వ్యాధి అయిన ఈ మధుమేహాన్ని సంపూర్ణంగా నివారించే చికిత్స లేకపోయినా.అదుపు చేసే మందులు మాత్రం ఉన్నాయి.
అలాగే కొన్ని కొన్ని న్యాచురల్ టిప్స్ ద్వారా కూడా మధుమేహాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు.
ముఖ్యంగా అందుకు నిమ్మ తొక్కలు అద్భుతంగా సహాయపడతాయి. """/"/
సాధారణంగా నిమ్మ రసం ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలుసు.
అయితే నిమ్మ రసమే కాదు.నిమ్మ తొక్కలు కూడా అనేక విధాలుగా ఆరోగ్యానికి ఉపయోగపడతాయి.
నిమ్మ తొక్కల్లో విటమిన్ సి, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్, సిట్రిక్ యాసిడ్ ఇలా ఎన్నో పోషకాలు ఉంటాయి.
అందుకే నిమ్మ తొక్కలు కూడా ఆరోగ్యానికి గ్రేట్‌గా ఉపయోగపడతాయి.అందులోనూ ముఖ్యంగా మధుమేహం వ్యాధి గ్రస్తులు.
నిమ్మ తొక్కలను శుభ్రంగా కడిగి వాటర్‌లో వేసి బాగా మరిగించాలి.ఇప్పుడు ఈ వాటర్‌ను వడబోసుకుని అందులో కొద్దిగా స్వచ్ఛమైన తేనె కలిపి తీసుకోవాలి.
ఇలా రెగ్యులర్‌గా తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులోకి వస్తాయి.మరియు మెటబాలిజం రేటు పెంచుతుంది.
"""/"/
ఇక నిమ్మ తొక్కలతో మరిన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయి.పైన చెప్పిన విధంగా నిమ్మ తొక్కలను తీసుకుంటే.
వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలు దూరం అవుతాయి.
ఎముకలు, దంతాలు బలంగా మారతాయి.శరీరంలో పేరుకు పోయిన కొవ్వు కరిగి వెయిట్ లాస్ కూడా అవుతారు.
అంతేకాదు, నిమ్మ తొక్కలు తీసుకుంటే తెల్ల రక్త కణాల సంఖ్య పెరుగుతుంది.తద్వారా ప్రాణాంతక వ్యాధి అయిన క్యాన్సర్ వచ్చే రిస్క్ తగ్గు ముఖం పడుతుంది.
వార్2 సినిమాలో తారక్ రోల్ వివరాలు ఇవే.. దేశం కోసం ప్రాణాలిచ్చే రోల్ అంటూ?