చుండ్రును సుల‌భంగా నివారించే నిమ్మ ఆకులు..ఎలాగంటే?

స్త్రీల‌నే కాదు పురుషుల‌ను కూడా అత్య‌ధికంగా వేధించే స‌మ‌స్య‌ల్లో చుండ్రు ముందుంటుంది.

ఈ చుండ్రు వ‌ల్ల చికాకు, దుర‌దే కాదు.హెయిర్ ఫాల్ కూడా ఎక్కువ‌గా ఉంటుంది.

అందుకే చుండ్రును వ‌దిలించుకునేందుకు ర‌క‌ర‌కాల షాంపూలు వాడుతూ ఉంటారు.ఎన్నెన్నో ఆయిల్స్ మారుస్తుంటారు.

కొంద‌రు చుండ్రును పోగొట్టుకునేందుకు ఏవో ట్రీట్ మెంట్స్ కూడా చేయించుకుంటారు.కానీ, ఎలాంటి ఖ‌ర్చు లేకుండా ఇంట్లోనే నిమ్మ ఆకుల‌తో చుండ్రుకు బై బై చెప్పొచ్చు.

మ‌రి నిమ్మ ఆకుల‌ను ఎలా యూజ్ చేయాలి అన్న‌ది ఆల‌స్యం చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.

చుండ్రును సుల‌భంగా నివారించ‌డంలో నిమ్మ ఆకులు అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.ముందుగా ఒక చిన్న క‌ప్పు వాట‌ర్ తీసుకుని అందులో కొన్ని ఫ్రెష్‌గా ఉన్న నిమ్మ ఆకుల‌ను వేసి మ‌రిగించాలి.

అనంత‌నం ఈ ఆకుల‌ను మెత్త‌గా పేస్ట్ చేసి త‌ల‌కు ప‌ట్టించాలి.గంట త‌ర్వాత కెమిక‌ల్స్ త‌క్కువ‌గా ఉండే షాంపూతో త‌ల‌స్నానం చేయాలి.

వారంలో ఇలా రెండు సార్లు చేస్తే చుండ్రు ప‌రార్ అవుతుంది. """/" / అలాగే నిమ్మ ఆకుల‌ను కొన్ని తీసుకుని బాగా ఎండ బెట్టి పొడి చేసుకోవాలి.

ఇప్పుడు ఈ నిమ్మ ఆకుల పొడిలో పెరుగు, నిమ్మ ర‌సం మ‌రియు కొబ్బ‌రి నూనె వేసి మిక్స్ చేసుకుని త‌ల‌కు అప్లై చేయాలి.

ముప్పై, న‌ల‌బై నిమిషాల అనంత‌రం గోరు వెచ్చ‌ని నీటితో హెడ్ బాత్ చేయాలి.

ఇలా మూడు రోజుల‌కు ఒక సారి చేసినా చుండ్రు పోతుంది.ఇక నిమ్మ ఆకుల‌ను మెత్త‌గా పేస్ట్ చేసి.

అందులో ఆలివ్ ఆయిల్ వేసి మిక్స్ చేయాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని త‌ల‌కు బాగా ప‌ట్టించి.

అర గంట పాటు వ‌దిలేయాలి.ఆ త‌ర్వాత మామూలు షాంపూ యూజ్ చేసి త‌ల స్నానం చేయాలి.

ఇలా చేసినా కూడా చుండ్రు క్ర‌మంగా త‌గ్గిపోతుంది.

నాకు అవార్డు రాకుండా రాజకీయం చేశారు.. బాబు మోహన్ సంచలన వ్యాఖ్యలు!