పడ్డ చోటే లేవాలనుకుంటున్న లెజెండ్ శరవణన్.. మారిన ఈ హీరోకు సక్సెస్ దక్కుతుందా?
TeluguStop.com
ఏ రంగంలో అయినా సక్సెస్ అనేది దక్కడం సులువైన సంగతి తెలిసిందే.బిజినెస్ లో ఊహించని సక్సెస్ అయిన శరవణ స్టోర్స్ అధినేత శరవణ ది లెజెండ్( The Legend ) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.
80 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కగా కనీసం 10 కోట్ల రూపాయల కలెక్షన్లు కూడా రాలేదు.
ఈ సినిమాపై ఊహించని స్థాయిలో ట్రోల్స్ వచ్చాయనే సంగతి తెలిసిందే. """/" /
కొత్త మేకోవర్ తో శరవణన్ మరో సినిమాలో నటిస్తున్నారు.
దురై సెంథిల్ కుమార్( Durai Senthilkumar ) డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది.
అయితే ఈ సినిమా కోసం శరవణన్ లుక్స్ మార్చుకున్నారు.మాస్ హీరోగా కనిపించడానికి అవసరమైన లుక్స్ తో ఆయన కనిపిస్తుండటం గమనార్హం.
శరవణన్ కొత్త లుక్స్ చూసి ఆశ్చర్యపోవడం నెటిజన్ల వంతవుతోంది.ఫస్ట్ సినిమా విషయంలో జరిగిన తప్పులు రిపీట్ కాకుండా శరవణన్ జాగ్రత్త పడుతున్నారు.
"""/" /
100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం.
ఈ సినిమా కూడా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోందని సమాచారం అందుతోంది.మరి ఈసారైనా శరవణన్ కోరుకున్న భారీ సక్సెస్ దక్కుతుందో లేదో చూడాల్సి ఉంది.
శరవణన్ ( Saravanan )ఒక్క హిట్ సాధించినా కెరీర్ పరంగా వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు.
శరవణన్ కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది.శరవణన్ కెరీర్ పరంగా సక్సెస్ సాధించాలని అతనిని అభిమానించే వాళ్లు చెబుతున్నారు.
శరవణన్ అంతకంతకూ ఎదిగి కెరీర్ పరంగా మరిన్ని విజయాలను అందుకుంటే మాత్రం ఆయన వార్తల్లో నిలిచే ఛాన్స్ అయితే ఉంది.
శరవణన్ తనను తాను మలచుకున్న తీరును మాత్రం నెటిజన్లు ఎంతగానో మెచ్చుకుంటున్నారు.
సూపర్ హీరో పాత్రలో మాస్ మహారాజ్ రవితేజ.. ఈ హీరో ఖాతాలో బ్లాక్ బస్టర్ పక్కా!