లెక్చ‌ర‌ర్ నిర్వాకంతో మ‌న‌స్తాపం చెందిన బాలుడు ! చివ‌రికి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం ! అస‌లు ఏంజ‌రిగిందంటే ?

గురువు అంటే విద్యార్థుల స‌ర్వ‌తోముఖాభివృద్ధికి తోడ్పాటందించాలి.ఇందుకు ఎంతో ఓపిక‌, స‌హ‌నం ఉండాలి.

ఎలాంటి ప‌రిస్థితులు ఎదురైనా కంట్రోల్ లో ఉండాలి.విద్యార్థులు మాట విన‌కుంటే న‌చ్చ‌జెప్పాలి.

వారితో సున్నితంగా వ్య‌వ‌హ‌రించాలి.అలా కాకుండా కోపంతో ఊగిపోయి త‌మ ప్ర‌తాపాన్ని విద్యార్థుల‌పై చూపిస్తే క‌రెక్ట్ కాదు.

విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఇలాంటి గురువులే పైశాచిక‌త్వానికి పాల్ప‌డితే భ‌విష్య‌త్ అంధ‌కారం అవ్వ‌క మాన‌దు.

ఇదే త‌ర‌హాలో ఓ లెక్చ‌ర‌ర్ క‌ర్క‌శంగా వ్య‌వహ‌రించి త‌న క్రూర‌త్వాన్ని విద్య‌ర్థిపై ప్ర‌ద‌ర్శించాడు.

అల్ల‌రి చేస్తున్నాడ‌న్న‌కార‌ణంతో చిత‌క‌బాదాడు.ఇలా త‌న గురువు ప్ర‌వ‌ర్త‌న‌కు బెంబేలెత్తిపోయిన విద్యార్థి మ‌నోవేద‌న‌తో ఇంటికి పోయాడు.

స‌ద‌రు విద్యార్థి మ‌నోవేద‌న‌కు గురై చివ‌ర‌కు ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసుకున్నాడు.దీంతో విద్యార్థి త‌ల్లిదండ్రులు ఆవేద‌న‌కులోన‌య్యారు.

చికిత్స నిమిత్తం స‌ద‌రు విద్యార్థుడిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.విచ‌క్ష‌ణ మ‌రిచి ప్ర‌వ‌ర్తించిన లెక్చ‌ర‌ర్‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని బాధిత విద్యార్థి త‌ల్లిదండ్రులు కోరుతున్నారు.

ఏపీ రాష్ట్రం గుంటూరు జిల్లా స‌త్తెన‌ప‌ల్లి ప‌ట్ట‌ణానికి చెందిన కాశియ్య కుమారుడు విన‌య్ గుంటూరు పెద‌ప‌ల‌క‌లూరు రోడ్డులోని ఓ ప్ర‌యివేటు క‌ళాశాలో ఇంట‌ర్ చ‌దువుతున్నాడు.

త‌న స్నేహితుల‌తో క‌లిసి క‌ళాశాల ఆవ‌ర‌ణ‌లో అల్ల‌రి చేస్తున్నాడంటూ క‌ళాశాల‌లోని జూనియ‌ర్ అధ్యాప‌కుడు విన‌య్‌ను చిత‌క‌బాదాడు.

ఈ ఘ‌ట‌న‌లో విన‌య్‌కు తీవ్ర‌గాయాలు కాగా స‌త్తెన‌ప‌ల్లిలోని త‌న ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకి విష‌యం చెప్పాడు.

అనంత‌రం మ‌నోవేద‌న‌కు గురై విన‌య్ ఆత్మ‌హ‌త్య చేసుకునేందుకు య‌త్నించాడు.స‌ద‌రు విద్యార్థిని త‌ల్లిదండ్ర‌లు అడ్డుకున్నారు.

చికిత్స నిమిత్తం గుంటూరు జీజీహెచ్ ఆస్ప‌త్రికి చికిత్స నిమిత్తం త‌ర‌లించారు.త‌న కుమారుడిపై అనుచితంగా ప్ర‌వ‌ర్తించి చిత‌క‌బాదిన జూనియ‌ర్ లెక్చ‌ర‌ర్‌పై కేసు న‌మోదు చేసి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని బాధితుడి పేరెంట్స్ కోరారు.

ఈమేర‌కు పోలీసుల‌కు ఫిర్యాదు కూడా చేయ‌నున్న‌ట్టు విద్యార్థి తండ్రి తెలిపారు.

పాన్ ఇండియా లో సత్తా చాటే ప్రయత్నం చేస్తున్న యంగ్ హీరోలు…