బ్యాంకు అకౌంట్ ను యాక్టీవ్ లో ఉంచడంలేదా? ఈ నష్టాలను ఎదురుకోవాల్సిందే!

భారతదేశ ఆర్థిక వ్యవస్థలో బ్యాంకింగ్ రంగానికి ఓ కీలకమైన పాత్ర ఉంది.దేశంలోని సాధారణ ప్రజల నుంచి పెద్ద వ్యాపార సంస్థల వరకు ప్రతి ఒక్కరితో నిత్య సంబంధం ఉన్న రంగం ఇది.

డిపాజిట్లు, రుణాలు, పేమెంట్ సిస్టమ్స్( Deposits, Loans, Payment Systems ) వంటి అనేక సేవల ద్వారా బ్యాంకులు ఆర్థిక వ్యవస్థను చక్కగా నడిపించడంలో సహాయపడుతున్నాయి.

ఇప్పుడు మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా బ్యాంకింగ్ సేవలు మరింత సులభం అయ్యాయి.

అయితే, బ్యాంక్ అకౌంట్స్ వాడకపోతే వాటి వల్ల కలిగే నష్టాలను చాలా మంది ఊహించరు.

మరి అవేంటో ఒకసారి చూద్దామా.ఒక బ్యాంకులో అకౌంట్( Bank Account ) ఉంటే, తప్పనిసరిగా మినిమమ్ బ్యాలెన్స్‌ను మెయింటెయిన్ చేయాల్సి ఉంటుందన్న విషయం తెలిసిందే.

ఈ నిబంధనను ఒకవేళ ఉల్లంఘిస్తే బ్యాంకులు పీనాల్టీగా చార్జీలు వసూలు చేస్తాయి.కొన్ని సందర్భాల్లో మైనస్ బ్యాలెన్స్ లోకి కూడా అకౌంట్ వెళ్తుంది.

కాబట్టి, భవిష్యత్తులో లావాదేవీలు చేయాలంటే ముందుగా మైనస్ బ్యాలెన్స్ క్లియర్ చేసి ఉపయోగించాల్సి ఉంటుంది.

అలాగే వాడకంలో లేని బ్యాంక్ అకౌంట్స్‌లో ఉన్న మినిమమ్ బ్యాలెన్స్ వంటివి వృధాగా మారిపోతాయి.

"""/" / ఇకపోతే, టెక్నాలజీ అభివృద్ధి కావడంతో సైబర్ మోసాలు ( Cyber ​​fraud )కూడా పెరిగిపోతున్నాయి.

వాడకంలో లేని అకౌంట్స్ సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉంది కాబట్టి.

, మీరు పెద్ద ఇబ్బందులకు లోనయ్యే ప్రమాదం ఉంది.కాబట్టి వాడని అకౌంట్లను రెగ్యులర్‌గా చెక్ చేయడం, లేకపోతే క్లోజ్ చేయడం మంచిది.

ఒకవేళ మీరు మీ బ్యాంక్ అకౌంట్ మైనస్ బ్యాలెన్స్‌లోకి వెళ్తే, అది క్రెడిట్ రిపోర్ట్ పై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది.

దీని వల్ల సిబిల్ స్కోర్ పడిపోతుంది.కాబట్టి భవిష్యత్తులో రుణాలు పొందడంలో కష్టాలు ఎదురవుతాయి.

అందుకే వాడని అకౌంట్లను వెంటనే క్లోజ్ చేయడం ఎంతో అవసరం.