అప్పటికి ఇప్పటికి హాట్ బ్యూటీ లో ఎంత మార్పు

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ ఎంట్రీ ఇచ్చే భామలలో చాలా మంది మధ్య తరగతి కుటుంబాల నుంచి వచ్చినవారే ఉంటారు.

  సినిమా మీద  ఉన్న ఇష్టం వారిని మోడలింగ్ వైపు అక్కడి నుంచి సినిమా రంగం వైపు వచ్చేలా చేస్తుంది.

 దీంతో హీరోయిన్స్ కెరియర్ తొలినాళ్ళ లో  చాలా ఏవరేజ్ గా అనిపిస్తూ ఉంటారు.

అయితే  సక్సెస్ తో పాటు, వారికి వచ్చే క్రేజ్ వారి లుక్స్ ని, ఆహార్యాన్ని మార్చేస్తాయి.

దీంతో అప్పుడు ఏదో సాదాసీదాకనిపించే  భామలు ఇప్పుడు హాట్ బ్యూటీస్ గా ఆకర్షిస్తూ ఉంటారు.

హీరోయిన్స్ లో వయసుతో పాటు కూడా లుక్ లో మార్పులు వస్తూ ఉంటాయి.

వీటికి ఎవరు అతీతం కాదు.తాజాగా ఇలాంటి లుక్స్ కి సంబంధించిన వీడియో ఒకటి బయటకి వచ్చింది.

ఆ వీడియోలో ఉన్నది నయనతార అనే విషయం చాలా మందికి వెంటనే అర్ధం కాలేదు.

నయనతార ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దశాబ్దానికి పైగా దాటిపోయింది.ఇప్పుడు సౌత్ లో స్టార్ హీరోయిన్ గా అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న నటిగా తనదైన గుర్తింపుతో దూసుకుపోతుంది.

అయితే నయనతారకు సంబంధించి కొన్నేళ్ల క్రితం చిత్రీకరించిన వీడియో ఒకటి నేడు పలు సోషల్  మీడియాలో వైరల్ గా మారింది.

 కెరియర్ తొలినాళ్ళలోఆమె ఒక మలయాళ ఛానల్ లో యాంకర్ గా పనిచేసింది.  ఆ సమయంలో కైరళి టీవీలో చమయం అనే ప్రోగ్రాంకి యాంకర్ గా వ్యవహరించిన నయనతార వీడియో క్లిప్పింగ్స్  ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి.

నయనతార లుక్స్ అప్పటికి, ఇప్పటికి  ఉన్న తేడా ని చూపిస్తూ కామెంట్స్ విపరీతంగా చేస్తున్నారు.

బాబు అల్లుడు కావడం ఎన్టీఆర్ దురదృష్టం.. లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు వైరల్!