భారత్‌కు భారీ సాయం ప్రకటించిన ప్రముఖ ఫార్మా కంపెనీ.. !

కోవిడ్ వల్ల భారత్ లో నెలకొన్న పరిస్దితులను చూస్తుంటే ఇంతకాలం కఠినంగా వ్యవహరించిన దేశాలు సైతం ఇండియాకు సహాయం చేయడానికి ముందుకు వస్తున్న విషయం తెలిసిందే.

ఇప్పటికే పలు దేశాలు వాటి వాటి స్దాయికి తగ్గట్లుగా ఆదుకుంటున్నాయి.ఈ క్రమంలో కరోనాతో పోరాడుతున్న భారత్‌కు సహయం చేయడానికి ప్రముఖ ఫార్మా కంపెనీ ముందుకు వచ్చింది.

భారీ సాయం ప్రకటించింది.ఇందులో భాగంగా ఫైజ‌ర్ చైర్మ‌న్ ఆల్బ‌ర్ట్ బౌర్లా, భారత్ కు సుమారుగా 7 కోట్ల డాలర్ల(దాదాపు రూ.

510 కోట్ల) విలువైన మందులను పంపించనున్నట్టు ప్రకటించారు.అంతే కాకుండా భారత్‌లో నెలకొన్న కరోనా పరిస్థితులు మమ్మల్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి.

ఇక్కడి ప్ర‌జ‌ల కోసం మేము ప్రార్థిస్తున్నాం అని ఫైజర్ ఇండియా ఉద్యోగులకు పంపిన మెయిల్‌లో ఆల్బర్ట్ బోర్లా పేర్కొన్నారు.

ఇకపోతే భారత్‌కు మందులను అమెరికా, ఐరోపా, ఆసియాలోని సంస్థకు చెందిన పలు పంపిణీ కేంద్రాల నుంచి అందించనున్నట్లు వెల్లడించారు.

ఇకపోతే ఇప్పటికే భారత్‌కు సహాయం అందించడానికి వివిధ దేశాలు ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

నిజంగా కరోనా తగ్గినాక కూడా ప్రపంచదేశాలు అన్ని తమ అధికార దాహాన్ని పక్కన పెట్టి ఇలాగే కలసి మెలసి ఉంటే అసలు యుద్దాలు అన్నవి జరగక ప్రపంచ శాంతి నెలకొనడం ఖాయమని అనుకుంటున్నారట.

కుక్కలు పదేపదే ఏడవడానికి గల కారణం ఏమిటో తెలుసా..?