పెద్దలింగాపూర్ లో బీఆర్ఎస్ ఖాళీ… కాంగ్రెస్ జోష్

రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం పెద్దలింగపూర్ గ్రామానికి చెందిన పలువురు బిఆర్ఎస్ నాయకులు వివిధ కుల సంఘాల నాయకులు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డా.

కవ్వంపల్లి సత్యనారాయణ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

పెద్దలింగాపూర్ గ్రామంలో డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రవేశ పెట్టిన పథకాలు మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేస్తామన్నారు.

మహాలక్ష్మి పథకం మహిళలకు ప్రతీ నెల ₹2500, కేవలం ₹500 కే వంట గ్యాస్ సిలిండర్,ఆర్టీసీ బస్సులో మహిళలు ఉచిత ప్రయాణం.

రైతు భరోసా పథకం ప్రతీ ఏటా రైతులకు & కౌలు రైతులకు ఎకరానికి ఏడాదికి రూ.

15,000.,12,000 వ్యవసాయ కూలీలకు అందిస్తామన్నారు.

వరి పంటకు క్వింటాల్ కు రూ 500 బోనస్ చెల్లిస్తామన్నారు.గృహ జ్యోతి పథకం కింద ప్రతి కుటుంబానికి ప్రతీ నెల 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామని తెలిపారు.

ఇందిరమ్మ ఇళ్లు పథకం కింద ఇల్లు లేని వారికి ఇంటి స్థలం & ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు.

ఉద్యమకారులకు 250 చ.గ ఇంటి స్థలం ఇస్తామన్నారు.

యువ వికాసం పథకం విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు.ప్రతీ మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామన్నారు.

చేయూత పథకం కింద వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, కల్లుగీత కార్మికులు, నేత కార్మికులు, ఎయిడ్స్, ఫైలేరియా బాధితులకు నెలకు రూ.

4,000 పింఛన్, పేదలకు 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ భీమా లను కాంగ్రెస్ మేనిఫెస్టోను ప్రజలకు వివరించాలని కోరారు.

చేతు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు వుట్కురి వెంకట రమణ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాఘవ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, సర్పంచ్ లు,యంపిటిసిలు,ఉప సర్పంచ్ లు,వార్డ్ మెంబెర్ లు, మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

సుకుమార్ శిష్యులు పాన్ ఇండియా డైరెక్టర్లుగా మారుతున్నారా..?