మన్మోహన్ సింగ్ మృతి పట్ల సంతాపం తెలిపిన భారత రాష్ట్ర సమితి నాయకులు

రాజన్న సిరిసిల్ల జిల్లా : భారతదేశ మాజీ ప్రధాని డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ మృతి దేశానికి తీరని లోటు అని బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అన్నారు.

శుక్రవారం సిరిసిల్ల లోని బీఆర్ఎస్ భవన్లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి, ఘనంగా నివాళులర్పించారు.

మన్మోహన్ సింగ్ మృతి పట్ల ప్రగాఢ సంతాపం ప్రకటించారు.ఈ సందర్భంగా తోట ఆగయ్య మాట్లాడుతూ మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మృతితో దేశం ఒక మహా నాయకుడిని కోల్పోయిందని అన్నారు.

ఆర్థిక శాస్త్రవేత్తగా ప్రస్థానం ప్రారంభించి, 1991లో ఆర్థిక సంస్కరణల ద్వారా దేశ ఆర్థిక వ్యూహాన్ని మారుస్తూ, దేశాన్ని గ్లోబల్ మార్కెట్‌లోకి చేర్చడంలో కీలక పాత్ర పోషించారని అన్నారు.

ఐఎంఎఫ్, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ వంటి అంతర్జాతీయ స్థాయి బాధ్యతలను నిర్వహించిన అనంతరం, కేంద్ర ఆర్థిక మంత్రి, 10 సంవత్సరాల ప్రధానమంత్రిగా పని చేశారని,ఏ బాధ్యత నిర్వహించినా ప్రతి చోటా తనదైన ముద్ర కనబరిచారని అన్నారు.

ప్రధానమంత్రిగా తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసి తెలంగాణ ప్రజల కలను సాకారం చేశారని అన్నారు.

ఈ కార్యక్రమంలో సిరిసిల్ల మున్సిపల్ వైస్ చైర్మన్ మంచే శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

డబ్బులు ఎవరికి ఊరికే రావు… అనిల్ రావిపూడి కామెంట్స్ ఆయన గురించేనా?