జేఎన్టీయూహెచ్ కిచెన్‌లో పిల్లి ప్రత్యక్షం.. ఎలుక కోసమే వచ్చిందంటూ నేతలు జోకులు..!

ఇటీవల కాలంలో హాస్టల్స్‌లో వడ్డించే ఆహార శుభ్రతపై చాలా ఆందోళనలను నెలకొంటున్నాయి.అందుకు కారణం ఆహారాల్లో ఎలుకలు, బొద్దింకలు, బల్లులు రావడమే అని చెప్పవచ్చు.

రెండు నెలల క్రితం సంగారెడ్డి జిల్లాలోని సుల్తానాపూర్ ఇంజనీరింగ్ కాలేజీ క్యాంపస్ లో ఆహారంలో బతికి ఉన్న ఎలుక తిరుగుతూ షాక్ కి గురి చేసింది.

జేఎన్టీయూహెచ్ హైదరాబాద్ ( Hyderabad ) హాస్టల్లో విద్యార్థులకు పెట్టే ఆహారంలో కూడా ఇలాంటి నాణ్యత లోపాలు, అపరిశుభ్రత బయటపడుతున్నాయి.

"""/" / ఇక్కడ విద్యార్థులకు పెట్టే ఆహారం ఎంత ప్రమాదకరమో తెలియజేసే మరో వీడియో తాజాగా వైరల్ అయింది.

ఈ వీడియోలో జేఎన్టీయూహెచ్ కిచెన్‌లో( JNTUH ) ఉన్న ఆహార పదార్థాల దగ్గర ఒక పిల్లి తిరుగుతూ ఉండడం చూడవచ్చు.

పది రోజుల క్రితం ఇదే కిచెన్ నుంచి వచ్చిన చట్నిలో ఓ ఎలుక కనిపించింది.

ఇప్పుడేమో పిల్లి ఆహార పదార్థాలను ముట్టుకుంటూ కనిపించడంతో విద్యార్థులు చాలా బాగా ఆందోళనలకు గురవుతున్నారు.

ఇలాంటి ఆహారం తింటే అనారోగ్యాల పాలవుతామేమో అని టెన్షన్ పడుతున్నారు. """/" / జేఎన్టీయూలో విద్యార్థుల కోసం వండిన వంటకాల్లో ఎలుక పడటం పట్ల బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు.

ఇంతకుముందు ఎలుక వచ్చిందని ఇప్పుడేమో ఆహారాన్ని తింటున్న పిల్లికి కనిపించిందని వారు ఫైర్ అవుతున్నారు.

బీఆర్ఎస్ నేత క్రిశాంక్ చేసిన ఈ వీడియోను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.దీనిని బీఆర్ఎస్ అగ్రనేత కేటీఆర్ ( BRS Leader KTR )రీషేర్ చేశారు.

"ఆహారంలో పడిన ఎలుకను వెతుక్కుంటూ వచ్చిన పిల్లి" అని క్రిశాంక్ పోస్ట్ చేయగా.

దానిపై కేటీఆర్ స్పందిస్తూ జేఎన్టీయూ కిచెన్ పిల్లులు, ఎలుకలకు ఇల్లు లాగా మారిందని ఎద్దేవా చేశారు.

మొత్తం మీద ఈ వ్యవహారం చాలా ముదురుతోంది.దీనిపై అధికారులు త్వరగా చర్య తీసుకుని విద్యార్థుల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది.

పదేళ్లలో నాకు నచ్చిన సినిమా అదే… హీరో నాని కామెంట్స్ వైరల్!