పాదయాత్రలో రాహుల్ గాంధీని కలిసిన నేతన్నలు, రైతులు
TeluguStop.com
మహబూబ్ నగర్ జిల్లాలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది.ఈ క్రమంలో ఆయనను చేనేత, పోడు రైతు ప్రతినిధులు కలిశారు.
ఈ సందర్భంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలను ప్రతినిధులు రాహుల్ గాంధీకి వివరించారు.ఇందిరమ్మ హయాంలో ఇచ్చిన భూములు లాక్కుంటున్నారని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు.
అదేవిధంగా చేనేత వస్తువులపై కేంద్రం విధించిన జీఎస్టీని కూడా ఎత్తేసేలా చూడాలని నేతన్నలు రాహుల్ గాంధీని కోరారు.
దీనిపై స్పందించిన రాహుల్ గాంధీ.కాంగ్రెస్ అధికారంలోకి రాగానే చేనేతపై జీఎస్టీ ఎత్తివేస్తామని భరోసా ఇచ్చారు.
వరుస ఫ్లాపులతో ఇబ్బందులు పడుతున్న హీరోలు వీళ్లే.. ఈ హీరోలకు సక్సెస్ దక్కుతుందా?