బాలయ్య బోయపాటి మూవీలో స్టార్ హీరోయిన్ కూతురు.. ఆ పాత్రలో కనిపిస్తారా?

నందమూరి నటసింహం బాలకృష్ణ( Balakrishna ) బోయపాటి శ్రీను( Boyapati Srinu ) కాంబినేషన్ లో ఇప్పటికే సింహా లెజెండ్ అఖండ వంటి సినిమాలో విడుదల అయ్యి ఎంతటి విజయాన్ని సాధించాయో మనందరికీ తెలిసిందే.

వీరి కాంబోలో చివరగా అఖండ సినిమా విడుదల అయ్యి భారీ విజయాన్ని అందుకుంది.

అయితే ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా అఖండ 2 సినిమా రాబోతోంది.

అఖండ సినిమా కథకు కొనసాగింపుగా ప్రస్తుతం అఖండ 2( Akhanda 2 ) రూపొందుతోంది.

అందుకే అందులోని పాత్రలను ఈ సినిమాలో కొనసాగించబోతున్నారు. """/" / అయితే అఖండ సినిమాలో చిన్న పాప పాత్ర అత్యంత కీలకంగా ఉంటుందన్న విషయం తెలిసిందే.

అయితే ఇప్పుడు ఆ పాప పాత్రను మరింతగా అఖండ 2 లో చూపించేందుకు దర్శకుడు బోయపాటి ప్లాన్‌ చేస్తున్నారు.

అఖండ 2 సినిమాలో ఆ పాప పాత్ర కోసం సీనియర్‌ హీరోయిన్‌ లయ కూతురు శ్లోకాను( Laya Daughter Sloka ) ఎంపిక చేసినట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

గత కొంత కాలంగా శ్లోకా ను సినిమా ఇండస్ట్రీలో పరిచయం చేయాలని లయ భావిస్తోంది.

అందుకు సరైన సమయం ఇదే అంటూ లయ నిర్ణయించుకుందట. """/" / అందుకే బాలకృష్ణ, బోయపాటి కాంబోలో రూపొందుతున్న సినిమాలో నటింపజేసేందుకు ఓకే చెప్పారని తెలుస్తోంది.

మరి ఈ వార్తల్లో నిజా నిజాల గురించి ఇంకా తెలియాల్సి ఉంది.ఈ వార్తలపై మూవీ మేకర్స్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.

ఇకపోతే ఇటీవల కాలంలో బాలయ్య బాబు బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ వరుస హిట్లతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

అందులో భాగంగానే ఇప్పుడు బాబీ దర్శకత్వంలో డాకు మహారాజ్ సినిమాలో నటిస్తున్నారు.ఈ సినిమా సంక్రాంతి పండుగ కానుకగా విడుదల కానుంది.

ఈ సినిమా విడుదల తర్వాత బాలయ్య బాబు బోయపాటి కాంబోలో రాబోతున్న అఖండ 2 సినిమాలో నటించనున్నారు.

దిష్టి మొత్తం పోయింది బాబాయ్.. అల్లు అర్జున్ అరెస్టుపై మనోజ్ కామెంట్స్!