జూనియర్ ఎన్టీఆర్ ను తీసుకొచ్చింది నేనే.. లక్ష్మీపార్వతి షాకింగ్ కామెంట్స్!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో నంబర్ వన్ స్థానానికి గట్టి పోటీ ఇస్తున్నారనే సంగతి తెలిసిందే.

సీనియర్ ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీ పార్వతి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తారక్ గురించి వెల్లడించిన విషయాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

నేను సీనియర్ ఎన్టీఆర్ ను స్వామి అని పిలిచానని ఆమె తెలిపారు.నా కలల రాకుమారుడు సీనియర్ ఎన్టీఆర్ అని ఆమె తెలిపారు.

నా వివాహమే ఒక పెద్ద విషాద కావ్యం అని ఆమె అన్నారు.బలవంతమైన ఒక పరిస్థితిలో నా పెళ్లి జరిగిందని ఆమె కామెంట్లు చేశారు.

సీనియర్ ఎన్టీఆర్ మెమొరీ అద్భుతం అని లక్ష్మీపార్వతి వెల్లడించారు.సీనియర్ ఎన్టీఆర్ కూడా నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారని లక్ష్మీ పార్వతి చెప్పుకొచ్చారు.

సీనియర్ ఎన్టీఆర్ నాకు దేవుడి కంటే కూడా ఎక్కువ అని ఆమె కామెంట్లు చేయగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

1989 ఓటమి సమయంలో ఓటమికి విజయానికి నాందిలా తీసుకోవాలని నేను సూచనలు చేశానని లక్ష్మీపార్వతి అన్నారు.

ఎన్టీఆర్ చరిత్ర రాయాలని ఉందని అడగగా నా చరిత్ర రాయడం తేలిక కాదని ఆయన అన్నారని లక్ష్మీపార్వతి తెలిపారు.

మా వయస్సులకు అతీతమైన ప్రేమ అని ఆమె అన్నారు.నా వల్ల టీడీపీ నష్టపోయిందని ప్రచారం చేశారని అమె కామెంట్లు చేయడం గమనార్హం.

"""/"/ బాలకృష్ణ కుటుంబంతో నాకు సత్సంబంధాలు ఉండేవని ఆమె అన్నారు.జూనియర్ ఎన్టీఅర్ తల్లి, జూనియర్ ఎన్టీఆర్ ను అప్పట్లో పిలిపించి షాలినికి పట్టుచీర, జూనియర్ ఎన్టీఆర్ కు డ్రెస్ తెప్పించి ఇచ్చానని ఆమె అన్నారు.

ప్రతిరోజూ జూనియర్ ఎన్టీఆర్ మా దగ్గరకు వచ్చి ఆడుకున్నాడని ఆమె కామెంట్లు చేశారు.

లక్ష్మీపార్వతి వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అన్నం గంజిలో ఇవి కలిపి జుట్టుకు రాస్తే మీ హెయిర్ డబుల్ అవుతుంది..!