జూనియర్ ఎన్టీఆర్ కు డ్రెస్ కొనిచ్చి ఆ మాట చెప్పా.. లక్ష్మీపార్వతి షాకింగ్ కామెంట్స్!

సీనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి గురించి ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

లక్ష్మీ పార్వతి గురించి ప్రజల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.కొంతమంది లక్ష్మీ పార్వతి గురించి పాజిటివ్ గా స్పందిస్తే మరి కొందరు ఆమె గురించి నెగిటివ్ గా స్పందిస్తారు.

ఒక ఇంటర్వ్యూలో లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ చేసిన ద్రోహాన్ని వాళ్లు ఎప్పుడు ఒప్పుకుంటారో ఎప్పుడు క్షమాపణలు చెబుతారో ఆరోజు కోపం కొంతవరకు చల్లారుతుందని ఆమె కామెంట్లు చేశారు.

సీనియర్ ఎన్టీఆర్ చితా భస్మాన్ని నేను దాచుకున్నానని చంద్రబాబు ఓడిపోయిన తర్వాత ఆ భస్మాన్ని తీసుకుని కావేరి నదిలో కొంత కలిపానని హరిద్వార్ లో కొంత కలిపానని లక్ష్మీ పార్వతి అన్నారు.

నా గురించి ఎన్నో అవాస్తవాలను ప్రచారం చేశారని ఆమె తెలిపారు.లారీలలో తెచ్చిన పట్టుబట్టలు, బుట్టల్లో నగలు నాకు ఉన్నాయని ప్రచారం చేశారని లక్ష్మీ పార్వతి అన్నారు.

ప్రేమతో, అభిమానంతో ప్రేమించి నేను సీనియర్ ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లానని ఆమె చెప్పుకొచ్చారు.

"""/"/ సీనియర్ ఎన్టీఆర్ కు ఆరోగ్యం బాలేని పరిస్థితులలో నేను ఆయనను నడిపించుకున్నానని ఆమె కామెంట్లు చేశారు.

మేమిద్దరం ఎన్నికల కోసం వెళ్లామని అప్పుడు బ్రహ్మాండమైన మెజారిటీ వచ్చిందని లక్ష్మీపార్వతి అన్నారు.

మా వివాహం తర్వాత ప్రజలు 222 సీట్లు ఇచ్చారని ఆమె కామెంట్లు చేశారు.

పెళ్లైన రోజు నుంచి పిచ్చిపిచ్చి కార్టూన్లు ప్రచారం చేశారని లక్ష్మీ పార్వతి అన్నారు.

"""/"/ వంశోద్దారకుడు విషయంలో నేను, నా భర్త నిర్ణయాలు తీసుకున్నామని వాటిని బయటకు చెప్పాల్సిన అవసరం లేదని ఆమె తెలిపారు.

నందమూరి వంశం పూర్తిస్థాయిలో స్వీకరించలేదని లక్ష్మీ పార్వతి అన్నారు.నేను స్వయంగా జూనియర్ ఎన్టీఆర్ ను ఎత్తుకున్నానని ఆమె తెలిపారు.

తల్లిని, పిల్లవాడిని ఇంటికి పిలిపించి జూనియర్ ఎన్టీఆర్ తల్లికి పట్టుచీర, పిల్లాడికి డ్రెస్ తెప్పించానని లక్ష్మీ పార్వతి అన్నారు.

నాన్నా నువ్వు రోజూ రా నాన్నమ్మ తాతయ్య ఉన్నామని జూనియర్ ఎన్టీఆర్ కు చెప్పానని లక్ష్మీ పార్వతి అన్నారు.

తారక్ ప్రతిరోజూ మా ఇంటికి వచ్చి కాసేపు ఆడుకుని వెళ్లేవాడని ఆమె కామెంట్లు చేశారు.

నాగచైతన్య శోభిత పెళ్లి… శోభిత ఫ్యామిలీ ఆ ఒక్కటి అడిగారు : నాగార్జున