కేసు వాదించడానికి మన దేశంలోనే ఒక్క రోజు కోసం లక్షల్లో ఫీజులు వసూల్ చేసే లాయర్లు వీళ్ళే

న్యాయాన్ని ఏ కీలుకు ఆ కీలు విరిచే వాళ్ల‌నే వ‌కీళ్లు అంటారు.తిమ్మిని బ‌మ్మిని చేసైనా స‌రే త‌న క్లైంటు కేసును గెలిపించేందుకు ప్ర‌య‌త్నిస్తారు లాయ‌ర్లు.

వీరిలో దేశ వ్యాప్తంగా పేరుపొందిన కొంద‌రు లాయ‌ర్లు ఉన్నారు.వారు సినిమా నటులు, క్రికెట‌ర్ల కంటే ఎక్కువ డ‌బ్బు సంపాదిస్తారంటే ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేదు.

అలా ఎక్కువ ఫీజులు తీసుకునే టాప్ లాయ‌ర్లు ఎవ‌రో ఇప్పుడు చూద్దాం.1.

రామ్ జెఠ్మ‌లానీ కొద్ది రోజుల క్రిత‌మే రామ్ జెఠ్మ‌లానీ చ‌నిపోయాడు.94 ఏండ్లు బ‌తికిన ఈయ‌న‌.

చ‌నిపోయే వ‌ర‌కు అదే వృత్తిలో కొన‌సాగారు.ఈయ‌న ఒక్క‌సారి కోర్టులో వాదించేందుకు అక్ష‌రాలా రూ.

25 ల‌క్ష‌లు తీసుకునే వారు.దేశంలోనే టాప్ క్రిమిన‌ల్ లాయ‌ర్ గా కొన‌సాగారు.

2.ఫాలి నారిమ‌న్ """/"/ దేశ న్యాయ వ్య‌వ‌స్థ‌కు ఈయ‌న ఎన్నో సేవ‌లు అందించారు.

దీనికి ఫ‌లితంగా ప‌ద్మ విభూష‌ణ్, ప‌ద్మ భూష‌ణ్ లాంటి అత్యున్న‌త పుర‌స్కారాలు అందుకున్నారు.

ఈయ‌న ఒక కేసు వాదిస్తే రూ.8 నుంచి 15 ల‌క్ష‌లు తీసుకుంటారు.

3.కేకే వేణుగోపాల్ """/"/ దేశంలోని ప్ర‌ముఖ లాయ‌ర్ల‌లో ఇత‌డు ఒక‌రు.

భూటాన్ రాజ్యాంగం రాయ‌డంలో ఈయ‌న కీల‌క పాత్ర పోషించారు.ఈయ‌న ఒక కేసు వాదించేందుకు.

రూ.5 నుంచి 7.

5 ల‌క్ష‌ల ఫీజు తీసుకుంటారు.4.

గోపాల్ సుబ్ర‌మ‌ణియం """/"/ ఈయ‌న సుప్రీంకోర్టుతో పాటు ఢిల్లీ హైకోర్టులో లాయ‌ర్ గా వాదిస్తున్నారు.

సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ గా కూడా బాధ్య‌త‌లు స్వీక‌రించారు.బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మెన్ గా ప‌నిచేశారు.

ఈయ‌న ఒక కేసు వాదించేందుకు రూ.5 నుంచి 15 ల‌క్ష‌లు తీసుకుంటారు.

5.చిదంబ‌రం """/"/ కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో కేంద్ర మంత్రిగా ప‌నిచేశారు చిదంబ‌రం.

ఆయ‌న కార్పొరేట్ లాయ‌ర్.సుప్రీం కోర్టు స‌హా ప‌లు హైకోర్టుల్లో కేసులు వాదించాడు.

ఈయ‌న కూడా కేసుకు రూ.5 ల‌క్ష‌ల‌కు పైనే తీసుకుంటారు.

6.హ‌రీష్ సాల్వే """/"/ ఈయ‌న దేశంలోని ప్ర‌ముఖ లాయ‌ర్ల‌లో ఒక‌రు.

సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ గా ప‌నిచేశారు.ప‌లు ఎమ్మెన్సీ కంపెనీల‌కు లాయ‌ర్ గా ప‌నిచేశారు.

ఒక కేసుకు రూ.6 నుంచి 15 ల‌క్ష‌లు తీసుకుంటారు.

కుల్ భూష‌ణ్ యాద‌వ్ కేసును కేవ‌లం రూ.1 కే వాదించి వార్త‌ల్లో నిలిచారు సాల్వే.

7.అభిషేక్ సింఘ్వి """/"/ ఈయ‌న కేవ‌లం 37 ఏండ్ల వ‌య‌సులోనే అడిష‌నల్ సొలిసిట‌ర్ జ‌న‌రల్ గా ప‌నిచేశారు.

కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత అయిన ఇత‌డు.ఒక్కో కేసు వాదించేందుకు రూ.

6 నుంచి 11 ల‌క్ష‌లు తీసుకుంటారు.8.

ఆర్య‌మ సుంద‌రం """/"/ బీసీసీఐ లీగ‌ల్ అడ్వ‌యిజర్ ఉన్నారు.రిల‌య‌న్స్ కంపెనీకి లాయ‌ర్ గా ప‌నిచేస్తున్నారు.

ఈయ‌న ఒక్కో కేసు వాదించేందుకు రూ.5 నుంచి 16 ల‌క్ష‌లు తీసుకుంటారు.

9.స‌ల్మాన్ ఖుర్షీద్ """/"/ కాంగ్రెస్ హ‌యాంలో కేంద్ర‌మంత్రిగా ప‌నిచేశారు.

ఒక్కో కేసుకు రూ.5 ల‌క్ష‌లు తీసుకుంటారు.

10.కేటీఎస్ తుల‌సి """/"/ ఈయ‌న సుప్రీంకోర్టు సినియ‌ర్ లాయ‌ర్.

రాబ‌ర్ట్ వాద్రా కేసును ఈయ‌నే డీల్ చేశారు.ఒక్కో కేసుకు రూ.

5 ల‌క్ష‌లు తీసుకుంటారు.