రజినీకాంత్ తో పాటు రాజకీయ ప్రయాణం చేస్తా అంటున్న లారెన్స్

రజినీకాంత్ తో పాటు రాజకీయ ప్రయాణం చేస్తా అంటున్న లారెన్స్

సైడ్ డ్యాన్సర్ గా కెరియర్ ప్రారంభించి తరువాత కొరియోగ్రాఫర్ గా, హీరోగా, దర్శకుడుగా.

రజినీకాంత్ తో పాటు రాజకీయ ప్రయాణం చేస్తా అంటున్న లారెన్స్

సంగీత దర్శకుడుగా రాణించి తనకంటూ ప్రత్యేకమైనగుర్తింపు సొంతం చేసుకున్న వ్యక్తి రాఘవ లారెన్స్.

రజినీకాంత్ తో పాటు రాజకీయ ప్రయాణం చేస్తా అంటున్న లారెన్స్

ఇప్పటికి హీరోగా ఓ వైపు చేస్తూ మరో వైపు దర్శకుడుగా సౌత్ ఇండియాలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న లారెన్స్ కేవలం తెరపైనే కాకుండా నిజజీవితంలోకూడా హీరో అనిపించుకున్నాడు.

వికలాంగులైన వారిని చేరదీసి డాన్స్ నేర్పించడంతో పాటు, ఎంతో మందికి గుండె ఆపరేషన్లు తన స్వచ్చంధ సంస్థ ద్వారా చేశాడు.

సామాజిక సేవా కార్యక్రమాలలో ఎప్పుడు ముందుండే లారెన్స్ తన సంపాదనలో చాలా వరకు సామాజిక సేవ దానికోసమే ఖర్చు పెడుతూ ఉంటాడు.

త్వరలో లారెన్స్ రజినీకాంత్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ కూడా సొంతం చేసుకున్నాడు.

రజినీకాంత్ కి వీరాభిమాని అయినా రాఘవ లారెన్స్ అతని బాటలోనే తాను నడుస్తానని తాజాగా కీలక ప్రకటన చేశారు.

తాను రాజకీయాలలోకి వస్తున్నట్లు రజినీకాంత్ గతంలో ప్రకటన చేశారు.పార్టీ పెట్టకున్న ఇప్పటికే తనకంటూ ఒక క్యాడర్ ని రజిని తమిళనాట బిల్డ్ చేసుకున్నాడు.

అయితే రజినీకాంత్ తమిళ వ్యక్తి కాదని, అతను తమిళనాడులో రాజకీయాలు చేసేందుకు అర్హుడు కాదని విమర్శలు వచ్చిన అతని వెంట లక్షలాది మంది నడవడానికి సిద్ధంగా ఉన్నారు.

అయితే అధికారికంగా పార్టీ ఎప్పుడు పెడతాడు అనే విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత రాలేదు.

ఇదిలా ఉంటే రజినీకాంత్ పార్టీ పెట్టిన వెంటనే అతని పార్టీలో నేను జాయిన్ అవుతా అని అతని బాటలోనే రాజకీయాలు చేస్తానని లారెన్స్ చెప్పాడు.

అంతే కాకుండా తాను చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు మరింత విస్తరించేందుకు రాజకీయంలోకి వస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.

మరి రజినీకాంత్ పార్టీ ఎప్పుడు పెడతాడు.లారెన్స్ అందులో ఎప్పుడు చేరుతాడు అనేది చూడాలని తమిళనాట చెప్పుకుంటున్నారు.

అయ్యో, పాపం.. కట్టెలు కొడుతూ మనవడిని పొరపాటున నరికేసిన అమ్మమ్మ.. ప్రాణం పోయింది..