Lavanya Tripati:లావణ్య త్రిపాఠి ..చాలా మంది హీరోయిన్స్ కన్నా రెబల్ ..ఎందుకో తెలుసా ?

మెగా ఇంటికి కోడలిగా వెళ్లనున్న లావణ్య త్రిపాఠి( Lavanya Tripati ) గురించి అందరికి తెలిసిందే.

వరుణ్ తేజ్( Varun Tej ) తో సినిమాల్లో నటిస్తున్న టైం లోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు.

చాల రోజులుగా వీరి ప్రేమ వ్యవహారం గురించి ఇండస్ట్రీ లో వార్తలు వస్తూనే ఉన్నాయ్.

ఎట్టకేలకు వీరి ప్రేమ బంధాన్ని ధ్రువీకరిస్తూ తాజాగా నిశ్చితార్థం కూడా ఘనంగా జరుపుకున్నారు.

ఇక మెగా ఇంటికి కోడలు కాబోతున్న లావణ్య త్రిపాఠి మిగతా హీరోయిన్స్ కన్నా చాల భిన్నమైన వ్యక్తిత్వం ఉన్న అమ్మాయి.

పైగా వరుణ్ తేజ్ కన్నా కూడా సామజిక వర్గం విషయంలోనూ ఆమెదే పై చెయ్యి.

ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్య లో పుట్టింది. """/" / అక్కడి అలహాబాద్ లో ని హై కోర్ట్ లో వకీల్ గా పని చేస్తున్నాడు.

ఆమె తల్లి ఉపాధ్యాయురాలు.వీరిద్దరి ప్రభావం లావణ్య త్రిపాఠి పై బాగా ఉండేది.

ఉన్నత విద్యావంతులైన దంపతులకు పుట్టిన లావణ్య సైతం డెహ్రాడూన్, ముంబై వంటి ప్రాంతాల్లో మంచి విద్య సంస్థల్లో చదువును పూర్తి చేసింది.

మంచి కుటుంబ నేపధ్యం, ఉన్నత చదువు ఉన్న లావణ్య ఆ మధ్య కాలంలో బ్రాహ్మణులపై కొన్ని వ్యాఖ్యలు చేసి నెటిజన్స్ ఆగ్రహానికి గురయ్యింది.

లోక్ సభ స్పీకర్( Lok Sabha Speaker ) మరియు వైశ్య ప్రముఖుడు అయినా ఓం బిర్లా( Om Birla ) తో ఆమె మీడియా ముఖంగా విభేదించింది.

2019 లో ఓం బిర్లా బ్రాహ్మణులను ఉద్దేశించి కొంత ప్రశంసలతో కూడిన వ్యాఖ్యలు చేసాడు.

బ్రాహ్మణులే ఈ రోజు ఎందరికో మార్గదర్శకంగా ఉన్నారు అంటూ వారిని ఆకాశానికి ఎత్తే ప్రయత్నం చేసాడు.

"""/" / అయితే స్వతహాగా బ్రాహ్మణ మహిళా అయినా లావణ్య ఆ వ్యాఖ్యలను వ్యతిరేకించింది.

ఎవరు కూడా ఇక్కడ కులం కారణంగా గొప్ప వారు కాలేరు అని, వారు చేసే పనుల వల్లే వారి గొప్పతనం ఉంటుందంటూ బహిరంగంగా ఓం బిర్లా కు సవాల్ విసిరింది.

ఇంత చిన్నతనంలోనే ఆమెకు కులం పట్ల ఉన్న అవగాహనా ఆమె చదివిన చదువుల వల్ల వచ్చి ఉండవచ్చు.

అయితే ఆమె చేసిన వ్యాఖ్యల వల్ల బీజేపీ పార్టీ ఆమెకు సోషల్ మీడియాలో దాడి మొదలయ్యింది.

ఎంతలా అంటే లావణ్య తన ట్వీట్ ని తొలిగించిన కూడా ఆమె పై మాటల దాడి ఆగలేదు.

ఇలా లావణ్య చాల విషయాల్లో వరుణ్ తేజ్ తో పోలిస్తే స్ట్రాంగ్ గానే కనిపిస్తుంది.

అయ్యబాబోయ్.. రైలు టికెట్‌పై ఇన్ని వసతులు ఉచితంగా ఉంటాయని మీకు తెలుసా..?