వరుణ్ తో లవ్.. అల్లు అరవింద్ కామెంట్లపై స్పందించిన లావణ్య?
TeluguStop.com
తెలుగు సినీ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో లావణ్య త్రిపాఠి( Lavanya Tripati ) ఒకరు.
ఈమె ఉత్తరాది అమ్మాయి అయినప్పటికీ టాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలను అందుకొని ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.
ఇకపోతే ఈమె హీరో వరుణ్ తేజ్ ( Varun Tej ) ను ప్రేమించి రహస్యంగా కొన్ని సంవత్సరాల పాటు ప్రేమ ప్రయాణం చేస్తూ అనంతరం పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే .
నవంబర్ ఒకటవ తేదీ వీరి వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. """/" /
ఇలా వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టినటువంటి లావణ్య త్రిపాటి ఎంతో సంతోషంగా ఉన్నారు.
ఇకపోతే ఇటీవల ఈమె నటించిన మిస్ పర్ఫెక్ట్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సిరీస్ ప్రమోషన్లలో ఈమె పాల్గొని సందడి చేశారు ఈ క్రమంలోనే ఈమెకు ఎన్నో ప్రశ్నలు ఎదురయ్యాయి.
ఇక వరుణ్ తో ఈమె పెళ్లి జరగబోతుందన్న సమయంలో ఈమె గురించి అరవింద్ ( Allu Aravind ) ఒక సినిమా ఈవెంట్లో చేసినటువంటి వ్యాఖ్యలు పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి.
"""/" /
ఈమె తెలుగు స్పష్టంగా మాట్లాడటంతో ఎక్కడో ఉత్తరాది అమ్మాయి తెలుగు ఇంత స్పష్టంగా మాట్లాడుతుంది.
తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకుని ఇక్కడే సెటిల్ అవ్వు అంటూ అరవింద్ మాట్లాడినటువంటి వ్యాఖ్యలను వైరల్ చేశారు.
ఇక ఈ వీడియోని అల్లు అర్జున్( Allu Arjun ) సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన తండ్రి చాలా బిజీనరీ ఉన్న వ్యక్తి అంటూ చెప్పకు వచ్చారు.
దీంతో వీరి ప్రేమ విషయం ముందుగానే అల్లు అరవింద్ కు తెలుసు అని అందరూ భావించారు తాజాగా ఈ విషయం గురించి లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ.
అల్లు అరవింద్ గారికి ఎంతో విజినరీ ఉంది.కాకపోతే ఆయనకి తెలియని విషయాన్ని కూడా అలా ఎలా చెప్పారు అని నేను ఇప్పటికి సర్ప్రైజ్ అవుతున్నా అని లావణ్య త్రిపాఠి పేర్కొంది.
సుజీత్ నెక్స్ట్ సినిమాకి హీరో దొరికేశాడా..?