ఆ క్షణమే ప్రేమలో పడ్డాం… మా ప్రేమ ఎప్పటికీ శాశ్వతమే: లావణ్య త్రిపాఠి
TeluguStop.com
వరుణ్ తేజ్(Varun Tej) లావణ్య త్రిపాఠిలా(Lavanya Tripati) నిశ్చితార్థ ( Engagment )వేడుక ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది సినీ ఇండస్ట్రీకి చెందినటువంటి సెలబ్రిటీలను ఈ వేడుకకు ఆహ్వానించకపోయిన కేవలం మెగా అల్లు కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ నిశ్చితార్థ వేడుక చాలా ఘనంగా జరిగిందని చెప్పాలి.
ఈ విధంగా వీరిద్దరి నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఇకపోతే వీరిద్దరూ గత కొద్దిరోజులుగా ప్రేమలో మునిగి తేలుతున్న విషయం మనకు తెలిసిందే.
"""/" /
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాటి ప్రేమలో ఉన్నారు అంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న ఈ వార్తలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు.
ఇలా తమ ప్రేమ గురించి వార్తలు వచ్చిన ప్రతిసారి తమ మధ్య అలాంటిదేమీ లేదంటూ చెప్పుకొచ్చారు.
కట్ చేస్తే ఇద్దరి నిశ్చితార్థపు తేదీని ప్రకటించడంతో అందరూ ఆశ్చర్యపోయారు.ఇక ఈ నిశ్చితార్థపు ఫోటోలను వరుణ్ తేజ్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నాకు ప్రేమ దొరికింది అంటూ ఈయన నిశ్చితార్థం ఫోటోలను షేర్ చేయగా లావణ్య త్రిపాఠి మాత్రం తమ ప్రేమ గురించి చెప్పుకొచ్చారు.
"""/" /
తమ మధ్య 2016 వ సంవత్సరంలోనే ప్రేమ చిగురించిందని అయితే ఈ ప్రేమ ఎప్పటికీ శాశ్వతంగా ఇలాగే ఉండిపోతుంది అంటూ తన నిశ్చితార్థం ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఇవి కాస్త వైరల్ అవుతున్నాయి.
ఇలా తమ ప్రేమ 2016లో చిగురించిందని చెప్పడంతో ఆ సంవత్సరంలో వీరిద్దరూ శ్రీను వైట్ల( Srinu Vaitla) దర్శకత్వంలో మిస్టర్ (Mister) అనే సినిమాలో నటించారు.
ఈ సినిమా సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని తెలుస్తోంది.ఏది ఏమైనా నటి లావణ్య త్రిపాఠి మెగా ఇంటి కోడలుగా అడుగుపెట్టబోతున్నారని తెలియడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఛీ.. ఛీ.. ట్రక్కులో ఇరుక్కుపోయిన వ్యక్తిని కాపాడాల్సింది పోయి.. చివరకు?