ఈ నటి ఎవరో గుర్తుపట్టండి చూద్దాం?
TeluguStop.com
గుర్తుపట్టారా? ఇంకా లేదా? తనేనండీ.టాలీవుడ్ లోకి అందాల రాక్షసిని అంటూ తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న మిథున.
గుర్తుకు వచ్చిందా? రాలేదా.సరే ఇంకో క్లూ ఇస్తున్న.
నందన అంటూ భలే భలే మొగాడివోయ్ సినిమాలో నాని పక్కన క్యూట్ గా నటించింది కదా! గుర్తొచ్చిందా? హా లావణ్య త్రిపాఠినే పైన ఫొటోలో ఉంది.
ఇటీవలే తన ఫోటో ఒకటీ నెట్టింటా వైరల్ అవుతుంది.అయితే ఎప్పుడులా కాకుండా ఈసారి గెస్ హూ ? అంటూ ఫోటో వైరల్ అవుతుంది.
దీంతో ఎంతోమంది టాలీవుడ్ ప్రేక్షకులు తన ఫోటోకు బ్యూటీ క్వీన్ లావణ్య త్రిపాఠి అంటూ కామెంట్లు చేస్తున్నారు.
అయితే లాక్ డౌన్ సమయం నుండి తన నుండి చాలా తక్కువ అప్డేట్స్ వస్తున్నాయి.
"""/"/
మొన్నటికి మొన్న తన పెంపుడు కుక్కకు సంబందించిన ఫోటోలు షేర్ చేసి నెటిజన్లను ఆకట్టుకున్న ఈ అందాల రాక్షసి.
నిన్నటికి నిన్న బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజపుత్ మరణంపై సిబిఐ విచారణ జరగాల్సిందే అని ట్విట్ పెట్టింది.
లావణ్య త్రిపాఠి అందాల రాక్షసి మాత్రమే కాదు మంచి మనసు ఉన్న హీరోయిన్ కూడా.
కరోనా వైరస్ లాక్ డౌన్ కాలంలో ఎంతోమందికి తనకు తోచిన సాయం చేసి మంచి మనసును చాటుకుంది.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి6, సోమవారం 2025