Lavanya Tripati: పెళ్లి తర్వాత లావణ్య ఏంటి ఇలా మారిపోయింది..షాక్ లో ఫ్యాన్స్?

నటి లావణ్య త్రిపాఠి(Lavanya Tripati) మెగా కోడలుగా మెగా ఇంటి అడుగుపెట్టిన సంగతి మనకు తెలిసిందే.

ఈమె నటుడు వరుణ్ తేజ్(Varun Tej) ప్రేమలో ఉంటూ ఈ ప్రేమ విషయాన్ని పెద్దలకు తెలియజేసి పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు.

ఇలా వీరి వివాహం తర్వాత మొదటిసారి లావణ్య వరుణ్ తేజ్ ఇద్దరు కూడా తన ఆడపడుచు నిహారిక సినిమా పూజా కార్యక్రమాలలో పాల్గొని సందడి చేశారు.

ఇక పెళ్లి తర్వాత మొదటిసారి లావణ్య త్రిపాఠి తన భర్త గురించి ఎంతో గొప్పగా చెబుతూ చేస్తున్నటువంటి పోస్ట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి మనకు తెలిసిందే.

వరుణ్ తేజ్ లావణ్య మిస్టర్ సినిమాలో కలిసిన నటించారు.ఈ సినిమా సమయంలోనే ప్రేమలో పడిన ఈ జంట పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు.

"""/" / వీరి వివాహం ఇటలీలో ఎంతో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే.

ఇటలీలో కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి జరిగినప్పటికీ హైదరాబాదులో టాలీవుడ్ సెలబ్రిటీలు అందరిని కూడా ఆహ్వానించు ఘనంగా పార్టీ ఇచ్చారు.

అదేవిధంగా లావణ్య త్రిపాఠి ఇంటిలో కూడా మరొకసారి రిసెప్షన్( Reception ) ఏర్పాటు చేసి లావణ్య బంధువులందరికీ కూడా ఈ రిసెప్షన్ వేడుకకు ఆహ్వానించారు.

ఇలా వీరి వివాహం ఎంతో వైభవంగా జరిగింది.ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఇక పెళ్లి తర్వాత మొదటిసారి లావణ్య త్రిపాఠి సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేశారు.

ఇందులో భాగంగా ఈమె చాలా హాట్ లుక్ లో కనిపించారు. """/" / బ్లూ కలర్ స్లీవ్ లెస్స డ్రెస్ లో( Blue Sleeveless Dress ) మత్తు కళ్ళతో భారీ స్థాయిలో మేకప్ వేసుకొని చాలా హాట్ ఫోటోలకు ఫోజులిస్తూ ఉన్నటువంటి వీడియోని లావణ్య త్రిపాఠి ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేయడంతో ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది.

ఇది చూసినటువంటి ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు.అదేంటి లావణ్య త్రిపాఠి పెళ్లి (Lavanya Tripati Marriage)తర్వాత గుర్తుపట్టలేనంతగా మారిపోయారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో చాలామంది అభిమానులు ఈ వీడియో పై వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

ఈ మధ్య కాలంలో లావణ్య త్రిపాఠిని ఇలా ఎప్పుడు కూడా చూడలేదు. """/" / ఇక పెళ్లి తర్వాత మొదటిసారి మెగా కోడలిని ఈ రేంజ్ లో చూడటంతో మెగా ఫాన్స్ కూడా ఒక్కసారిగా షాక్ లో ఉన్నారని చెప్పాలి.

ఈ వీడియో పై ఎంతోమంది నేటిజన్స్ స్పందిస్తూ మీరు మేకప్ లేకుండా చాలా న్యాచురల్ గా ఉంటేనే అందంగా కనిపిస్తారు ఈ మేకప్ అసలు సెట్ అవ్వడం లేదు అంటూ కామెంట్ చేస్తున్నారు.

మరి కొంతమంది మీరు నేచురల్ బ్యూటీ మేడం మీకు మేకప్ అవసరం లేదు మేకప్ లేకుండానే మీరు క్యూట్ గా ఉంటారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఏది ఏమైనా పెళ్లి తర్వాత మొదటిసారి లావణ్య త్రిపాఠిని ఇలా చూస్తామని అభిమానులు కూడా అనుకోలేదని చెప్పాలి.

షుగ‌ర్ తో ఇలా చేశారంటే మృదువైన మెరిసే కురులు మీ సొంత‌మ‌వుతాయి!