రెహమాన్ కోసం లావణ్య ఏం చేసిందంటే?

దర్శకుడు మణిరత్నం తెరకెక్కించే చిత్రాలకు ప్రత్యేక ఫాలోయింగ్ ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే.

ఆయన తెరకెక్కించే రొమాంటిక్ ఎంటర్‌టైనర్ చిత్రాలకు ఎలాంటి క్రేజ్ ఏర్పడుతుందో మనకు తెలుసు.

ఇక మణిరత్నం తెరకెక్కించే చిత్రాలకు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తూ వస్తున్నాడు.

వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘బొంబాయి’ చిత్రం అప్పట్లో ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే.

ఎవర్‌గ్రీన్ అందగాడు అరవింద్ స్వామి, మనీషా కొయిరాలా జంటగా నటించిన ఈ సినిమా రిలీజ్ అయిన అన్ని భాషల్లో కూడా సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది.

ఇక ఈ సినిమాలోని పాటలు రెహమాన్ కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచిపోయాయి.ఇప్పటికీ ఈ సినిమా పాటలను ప్రేక్షకులు ఆస్వాదిస్తుంటారు.

అయితే తాజాగా తనకు ఈ సినిమాలోని కన్నానులే పాట అంటే ఎంత ఇష్టమో తెలియజేసింది ‘అందాల రాక్షసి’ బ్యూటీ లావణ్య త్రిపాఠీ.

ఈ పాటకు సంబంధించిన కవర్ సాంగ్‌ను తన స్నేహితురాలితో కలిసి చాలా అందంగా తెరకెక్కించింది ఈ బ్యూటీ.

పచ్చని చెట్ల మధ్య, ఈ పాటకు తగ్గట్లుగా ఆమె డ్యాన్స్ చేస్తుంటే చాలా అందంగా కనిపించింది.

ఇక ఈ పాటకు తగ్గట్టుగా లావణ్య హావభావాలు ప్రేక్షకులను మెప్పించాయి.మొత్తానికి ఈ పాటతో లావణ్య త్రిపాఠీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో, ప్రస్తుతం ఆమె వీడియో సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది.

ఇక సినిమాల పరంగా లావణ్య త్రిపాఠీ ప్రస్తుతం సందీప్ కిషన్ సరసన ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’ చిత్రంలో నటిస్తోంది.

జీవితం మహా చెడ్డది భయ్యా.. భార్య వల్ల చెత్త ఏరుకునే స్థాయికి ఇంజనీర్‌..?