అదే నా విజయ రహస్యమంటున్న లావణ్య త్రిపాఠి..!

2012లో అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది లావణ్య త్రిపాఠి.

దూసుకెళ్తా, భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్నినాయన, శ్రీరస్తు శుభమస్తు సినిమాలతో విజయాలను అందుకున్న లావణ్య త్రిపాఠి గత మూడేళ్లలో నటించిన సినిమాలేవీ ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోలేదు అందం, అభినయం ఉన్నా నాగార్జున మినహా మరే స్టార్ హీరో లావణ్యకు ఛాన్స్ ఇవ్వలేదు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో సినిమా అవకాశాల గురించి, కెరీర్ గురించి మాట్లాడిన లావణ్య త్రిపాఠి స్టార్ హీరోలకు జోడీగా ఎక్కువగా అవకాశాలు రాకపోవడం గురించి తాను బాధ పడటం లేదని తెలిపారు.

స్టార్ హీరోలతో మాత్రమే నటించాలని అనుకుంటే కెరీర్ విషయంలో ఎదగలేమని అన్నారు.అభిమానులు తనను ఎక్కువగా సహజత్వంతో కూడిన పాత్రల్లో కనిపించాలని కోరుకుంటున్నారని తాను కూడా అలాంటి పాత్రలనే ఎంచుకుంటున్నానని అన్నారు.

"""/"/ ఏ సినిమాలో నటించినా మంచి పాత్రలో నటించాలనే భావన కలగడంతో పాటు కొత్తదనం ఉండాలని లావణ్య వెల్లడించారు.

ఏ సినిమాలో ఛాన్స్ వచ్చినా తన పాత్రకు పూర్తి న్యాయం చేయాలని అనుకుంటానని.

అలా చేయడానికే ప్రయత్నిస్తానని.అలా చేయడమే తన సక్సెస్ సీక్రెట్ అని ఆమె చెప్పారు.

తాను ట్రెండ్స్ ను ఎక్కువగా ఫాలో కావడానికి ఆసక్తి చూపనని ఫిల్మ్ ఇండస్ట్రీలో ట్రెండ్స్ మారడం సహజంగా జరుగుతుందని లావణ్య అన్నారు.

ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరికైనా సక్సెస్ అనేది కీలక పాత్ర పోషిస్తుందని.స్టోరీ నచ్చితే రిజల్ట్ గురించి ఆలోచించకుండా సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తానని లావణ్య వెల్లడించారు.

తను నటించిన ఎన్నో సినిమాలు సక్సెస్ అయ్యాయని స్టార్స్ తో నటించకపోయినా విజయాలు ముఖ్యమనే సిద్దాంతాన్ని నమ్మి తాను కెరీర్ విషయంలో ముందడుగులు వేస్తున్నానని లావణ్య వెల్లడించారు.

ప్రస్తుతం లావణ్య త్రిపాఠి రెండు సినిమాల్లో నటిస్తున్నారు.

నీ ఫోన్ ఆయుష్షు మామూలుగా లేదు సోదరా.. బాలయ్యతో ఫోటోపై నెటిజన్ల కామెంట్స్ వైరల్!