నోకియా నుంచి అదిరిపోయే స్మార్ట్ టీవీలు లాంచ్.. ధర ఎంత తక్కువో తెలుసా!

భారత్‌లో స్మార్ట్ టీవీలు మొబైల్స్ వలే అమ్ముడవుతున్నాయి.దీంతో షావోమీ, రియల్‌మీ, శాంసంగ్ వంటి కంపెనీలు ఇండియాలో ఎప్పటికప్పుడు సరికొత్త స్మార్ట్ టీవీలను లాంచ్ చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం నోకియా కూడా కొత్తగా 5 స్మార్ట్ టీవీలను భారత్‌లో విడుదల చేసి వినియోగదారులను ఆకట్టుకుంటోంది.

ఈ కంపెనీ 32 అంగుళాల హెచ్‌డీ వేరియంట్ నుంచి 55 అంగుళాల 4K మోడల్ వరకు రకరకాల టీవీలను లాంచ్ చేసింది.

హెచ్‌డీ, ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లేతో రెండు టీవీలను తీసుకొచ్చింది.4కే, యూహెచ్‌డీ డిస్‌ప్లేతో 3 టీవీలను పరిచయం చేసింది.

ఈ నోకియా టీవీలు ఆండ్రాయిడ్‌ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌ సాయంతో పనిచేస్తాయి.ఇవి క్రోమ్‌కాస్ట్, గూగుల్ అసిస్టెంట్‌ వంటి వాటికి సపోర్ట్ చేస్తాయి.

సపోర్టెడ్ యాప్స్‌ను గూగుల్ ప్లే స్టోర్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకొని మరింత వినోదాన్ని పొందొచ్చు.

ఈ స్మార్ట్ టీవీల్లో డాల్బీ ఆడియో, డ్యుయల్ బ్యాండ్ వైఫై వంటి ఆకర్షణీయ ఫీచర్లు ఉన్నాయి.

ధరల విషయానికొస్తే.నోకియా 32 అంగుళాల ఆండ్రాయిడ్‌ టీవీ రూ.

14,499కే లభిస్తోంది.40 అంగుళాల ఫుల్ హెచ్‌డీ వేరియంట్ ను మీరు కేవలం రూ.

21,990కే సొంతం చేసుకోవచ్చు.43 అంగుళాల 4K యూహెచ్‌డీ వేరియంట్ రూ.

27,999కి అందుబాటులోకి రాగా.50 అంగుళాల వేరియంట్ రూ.

33,990.55 వేరియంట్ ధర రూ.

38,999గా నిర్ణయించారు. """/" / 32, 40 అంగుళాల టీవీ మోడళ్లలో 270 నిట్ బ్రైట్‌నెస్‌, క్వాడ్‌కోర్ ప్రాసెసర్‌, 1జీబీ ర్యామ్, 8జీబీ ర్యామ్ ఇంటర్నల్ స్టోరేజ్ అందించారు.

43 అంగుళాలు, 50 అంగుళాలు, 55 అంగుళాలు టీవీల్లో హెచ్‌డీఆర్10, MEMC, డాల్బీ విజన్ సపోర్ట్ ఉంటుంది.

ఈ స్మార్ట్ టీవీల్లో క్వాడ్‌కోర్ ప్రాసెసర్‌, 2జీబీ ర్యామ్, 8జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ అందించారు.

వీటిపై ఆఫర్ల కోసం మీరు ఫ్లిప్‌కార్ట్‌ వెబ్సైట్ చెక్ చేయొచ్చు.