అసెంబ్లీలో ఊడిన సిద్ధ‌రామ‌య్య పంచె.. న‌వ్వులే న‌వ్వులు..

అసెంబ్లీలో ఊడిన సిద్ధ‌రామ‌య్య పంచె న‌వ్వులే న‌వ్వులు

అసెంబ్లీ అంటే ఎప్పుడూ చాలా సీరియ‌స్‌గా అనేక విష‌యాల‌పై చ‌ర్చ‌లు సాగుతుంటాయి.సభ మొత్తం గంభీరంగా న‌డుస్తుంది.

అసెంబ్లీలో ఊడిన సిద్ధ‌రామ‌య్య పంచె న‌వ్వులే న‌వ్వులు

అనేక అంశాల‌పై, అనేక బిల్లుల‌పై సీరియ‌స్‌గా అధికార ప‌క్షం, ప్ర‌తిప‌క్షాలు చ‌ర్చించుకుంటాయి.అయితే కొన్ని సార్లు స‌భ‌లో కూడా చాలా ఫ‌న్నీ మూమెంట్స్ జ‌రుగుతుంటాయి.

అసెంబ్లీలో ఊడిన సిద్ధ‌రామ‌య్య పంచె న‌వ్వులే న‌వ్వులు

ఇక ఇప్పున‌డు క‌ర్ణాట‌క అసెంబ్లీలో కూడా ఇలాంటి ఘ‌ట‌నే జ‌రిగింది.ఈ ఫ‌న్నీ మూమెంట్ తో సభ మొత్తం నవ్వులు పూసేశాయి.

అయితే ఎవ‌రూ ఊహించ‌న‌టువంటి ఈ ఘ‌ట‌న‌కు స్పీకర్ తో పాటుగా ఎమ్మెల్యేలు మొత్తం న‌వ్వేసుకున్నారు.

క‌ర్ణాట‌క మాజీ సీఎం అయిన సిద్ధరామయ్య గురించి అంద‌రికీ తెలిసిందే.అయితే ఇప్ప‌నుడు అక్క‌డ జ‌రుగుతున్న అసెంబ్లీ స‌మావేశాల్లో ఆయ‌న సీరియ‌స్‌గా మాట్లాడుతున్నారు.

ఇక ఆయ‌న ఏదో విష‌యంపై ఇలా మాట్లాడుతున్న క్ర‌మంలోనే ఆయ‌న క‌ట్టుకున్న పంచె కాస్త కొంచెం కొంచెం జారిపోవం మొద‌లైంది.

ఇక ఆయ‌న మాత్రం త‌న పంచె విష‌యాన్ని ప‌ట్టించుకోకుండా త‌న ప్ర‌సంగాన్ని సాగిస్తున్నారు.

ఇక ఈ విష‌యాన్ని ఇతర సభ్యులు గమనించి అల‌ర్ట్ చేసేందుకు ప్ర‌య‌త్నించారు.కానీ ఆయ‌న మాత్రం అవేవీ ప‌ట్టించుకోవ‌ట్లేదు.

"""/"/ దీంతో డీకే శివకుమార్ స్వ‌యంగా సిద్ధరామయ్య ద‌గ్గ‌ర‌కు వెళ్లి పంచె జారిపోతున్న సంగ‌తి ఆయ‌న చెవిలో చెప్పారు.

వెంట‌నే అల‌ర్ట్ అయిన సిద్ధరామయ్య ఓహ్.అవునా? అని చెప్ప‌డంతో అంద‌రికీ వినిఇపంచింది.

దీంతో ప‌గ‌ల‌బ‌డి న‌వ్వుకున్నారు స‌భ్యులు.ఇక ఆయ‌న మైక్‌లోనే పంచెను స‌రిగ్గా క‌ట్టుకున్న త‌ర్వాత స్పీచ్ కంటిన్యూ చేస్తానంటూ చెప్పారు.

ఇక మ‌ధ్య‌లో స్పీక‌ర్ క‌ల‌గ‌జేసుకుని సమస్య ఉంటే చెప్పండి అని ఫ‌న్నీగా అడిగారు.

ఇక దీనికి సిద్ద‌రామ‌య్య కూడా ఫ‌న్నీగానే కరోనా త‌ర్వాత బరువు తగ్గడం వ‌ల్లే పంచె లూజ్ అవుతోందంటూ న‌వ్వు తెప్పించారు.

ఈ వీడియో ఇప్పుడు నెట్టింట విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది.