వాట్సాప్ లో ఈ ఫీచర్ గురించి తెలిస్తే వావ్ అంటారు

ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్ ప్రవేశపెడుతూ వినియోగదారులను ఆకర్షించడమే కాకుండా తమ పోటీదార్లకు సవాల్ విసురుతూ వస్తోంది వాట్సాప్.

మారుతున్న వినియోగదారుల అభిరుచులను గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వారికి నచ్చేలా వారు మెచ్చేలా ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేస్తోంది.

అందుకే తమకు పోటీగా ఎన్ని యాప్స్ అందుబాటులోకి వచ్చినా వాట్సాప్ ను వదులుకునేందుకు వినియోగదారులు ఎవరూ ఇష్టపడడంలేదు.

వాట్సాప్ లో ఫీచర్స్ అన్ని డిఫరెంట్ గా ఉంటాయి.ఫోటోలు, వీడియోలు పంపుకోవడానికి, కాంటాక్ట్స్ ను గ్రూప్ లుగా ఏర్పాటు చేసుకుని ఎప్పటికప్పుడు తమ విశేషాలను పంచుకుంటూ ఉంటారు.

తాజాగా వాట్సాప్ మరో ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.అది ఏంటి అంటే గ్రూప్‌లో పెట్టిన మెసేజ్ ఒక నిర్ణీత సమయం తర్వాత ఆటోమేటిక్ గా డిలీట్ అయిపోతుంది.

ఇలా డిలేట్ ఆప్షన్ పెట్టుకోవడానికి ఒక సంవత్సరం వరకు టైం ను సెట్ చేసుకునేలా రూపొందించారు.

డిసప్పియరింగ్ మెసేజెస్ పేరుతో ఈ ఫీచర్ వాట్సాప్ బీటా వెర్షన్‌ను ఆండ్రాయిడ్‌లో వాడుతున్న వినియోగదారులకు అందుబాటులో వచ్చింది.

ఇక త్వరలోనే ఐఓఎస్ యూజర్లకు, మరికొంతకాలంలో వినియోగదారులందరికి అందించడానికి వాట్సాప్ సన్నాహాలు చేస్తోంది.

వాస్తవంగా మనం ఒక మెసేజ్ చేసి ఆల్ డిలీట్ చేస్తే ఆ మెసేజ్ అదృశ్యం అవుతుంది కానీ డిలీట్ చేసినట్టు అందరికీ అర్థమవుతుంది.

కానీ డిసప్పియరింగ్ మెసేజెస్ ఫీచర్‌లో అలా ఏమీ కనిపించదు.చాలా బాగుంది కదా ఈ ఫీచర్ ! మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే మీ వాట్సాప్ ను అప్డేట్ చేసేపనిలో ఉండండి.

సోషల్ మీడియా కార్యకర్తల కోసం రంగంలోకి జగన్ .. వీరికే ఆ బాధ్యతలు