Devara Movie : దేవర సినిమాలో మరో బాలీవుడ్ హీరోయిన్.. సినిమాపై అంచనాలను పెంచేస్తున్నారుగా?

టాలీవుడ్ పాన్ ఇండియా హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.దానికి తోడు ఆర్ఆర్ఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్( Janhvi Kapoor ) హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.

ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతోంది ఈ ముద్దుగుమ్మ. """/" / ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది.

అదేమిటంటే ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ఉండబోతుందని ఆ సాంగ్ లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్( Kriti Sanon ) చిందులు వేయబోతోంది అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

పాన్ ఇండియా మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని ఈ సాంగ్ చేయడానికి కృతి సనన్ ని ఒప్పించారని తతతెలుస్తోంది.

కాగా దేవర సినిమాను దాదాపు రూ.300 కోట్ల భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.

మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియదు గానీ, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి మాత్రం ఫుల్ కిక్ ఇస్తోంది.

ఎంతైనా కూడా కొరటాల శివ ఈ దేవర మూవీ కథ కోసం చాలా నెలలు కసరత్తులు చేశాడు.

"""/" / మరి కథలో కొరటాల శివ ఎలాంటి ఎలిమెంట్స్ రాశాడో చూడాలి.

ఇప్పటికీ కొరటాల శివ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో గతంలో విడుదలైన జనతా గ్యారేజ్( Janatha Garage ) సినిమా బ్లాక్ మాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే.

దాంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే.

ఈ మూవీ కోసం ఈ మూవీ అప్డేట్స్ కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

ఇప్పటి హీరోయిన్స్ లలో సాయి పల్లవి కి మాత్రమే ఈ ఘనత దక్కింది