Devara Movie : దేవర సినిమాలో మరో బాలీవుడ్ హీరోయిన్.. సినిమాపై అంచనాలను పెంచేస్తున్నారుగా?
TeluguStop.com
టాలీవుడ్ పాన్ ఇండియా హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.దానికి తోడు ఆర్ఆర్ఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్( Janhvi Kapoor ) హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.
ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతోంది ఈ ముద్దుగుమ్మ. """/" /
ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది.
అదేమిటంటే ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ఉండబోతుందని ఆ సాంగ్ లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్( Kriti Sanon ) చిందులు వేయబోతోంది అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
పాన్ ఇండియా మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని ఈ సాంగ్ చేయడానికి కృతి సనన్ ని ఒప్పించారని తతతెలుస్తోంది.
కాగా దేవర సినిమాను దాదాపు రూ.300 కోట్ల భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.
మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియదు గానీ, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి మాత్రం ఫుల్ కిక్ ఇస్తోంది.
ఎంతైనా కూడా కొరటాల శివ ఈ దేవర మూవీ కథ కోసం చాలా నెలలు కసరత్తులు చేశాడు.
"""/" /
మరి కథలో కొరటాల శివ ఎలాంటి ఎలిమెంట్స్ రాశాడో చూడాలి.
ఇప్పటికీ కొరటాల శివ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో గతంలో విడుదలైన జనతా గ్యారేజ్( Janatha Garage ) సినిమా బ్లాక్ మాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే.
దాంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే.
ఈ మూవీ కోసం ఈ మూవీ అప్డేట్స్ కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
వరల్డ్స్ మోస్ట్ వాంటెడ్ గర్ల్‌ఫ్రెండ్.. 5000 మందిని రిజెక్ట్ చేయడానికి అసలు కారణం ఇదేనట!