తండ్రిని మించి ఎదుగుతున్న అశ్వినీదత్ కూతుళ్లు.. వీళ్ల సినిమాలకు ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు సినీ ప్రేక్షకులకు నిర్మాత అశ్వినీదత్( Produced Ashwinidat ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న టాప్ నిర్మాతలలో ఒకరిగా రాణిస్తున్న ఆయన ప్రయాణం పడిలేస్తూనే సాగింది.

ఇండస్ట్రీ హిట్లతో పాటు డిజాస్టర్లు చూసారు.అంతేకాకుండా ఒకానొక దశలో సినిమాలు మానేయాలని కూడా ఆయన భావించారు.

ముఖ్యంగా ఎన్టీఆర్( NTR ) తో తీసిన శక్తి ఆయనకి ఓ పీడ కలలా మిగిలింది.

ఈ సినిమా తర్వాత మళ్ళీ నిర్మాతగా ఆయన పేరు ఇండస్ట్రీలో పెద్దగా వినిపించలేదు.

వయసు కూడా పైబడటంతో ఆయన కూడా ఇక సినిమాలని తగ్గించుకోవాలనే నిర్ణయానికి వచ్చేశారు.

"""/" / అయితే సరిగ్గా ఇదే సమయంలో వైజయంతి మూవీస్ ( Vyjayanthi Movies )కి పునర్వైభవం తీసుకురావాలని బలంగా నిర్ణయించుకున్నారు అశ్వినీదత్ వారసులైన ప్రియాంక, స్వప్న.

మారుతున్న ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు కథల ఎంపిక నుంచి సినిమా నిర్మాణం వరకూ అన్నీ తామై బ్యానర్ ని ముందుకు నడిపారు.

నాగ్ అశ్విన్( Nag Ashwin ) ప్రతిభపై వున్న నమ్మకంతో ఒక ప్రయోగాత్మక చిత్రంలానే ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాని నిర్మించారు.

దాంతో మంచి పేరు వచ్చింది.నిజానికి ఈ సినిమా నిర్మాణంలో కూడా అశ్వినీద‌త్ దూరంగానే వున్నారు.

"""/" / తర్వాత మహానటి లాంటి క్లాసిక్ తీసిన మళ్ళీ సగర్వంగా తండ్రి పేరుని ప్రజెంటర్ గా వేశారు స్వప్న, ప్రియాంక.

మరో క్లాసిక్ గా వచ్చిన సీతారామంతో వైజయంతి మూవీస్ పేరు మరోసారి మార్మ్రోగిపోయింది.

ఇప్పుడు కల్కి మూవీతో పాన్ వరల్డ్ సినిమాని అందించబోతున్నారు అశ్వినీదత్.ఇప్పటికే ఈ సినిమా ఎన్నో గొప్ప జ్ఞాపకాలని అశ్వినీదత్ కి ఇచ్చింది.

ఇకపోతే అశ్వినీదత్ ఈ స్థాయిలో ఉన్నారు అంటే అందుకు కారణం ఇద్దరు కూతుర్లే అన్న విషయం మనందరికీ తెలిసిందే.

వీరిద్దరూ తండ్రికి మించి ఎదుగుతూ మంచి మంచి సినిమాలను అందిస్తున్నారు.ఇక వీరి సినిమాలకు ఫిదా అవ్వాల్సిందే.

ఆ మూవీకి కోటి రూపాయల రెమ్యునరేషన్ అందుకున్న స్టార్ కమెడియన్.. ఏమైందంటే?