ఆ ఒక్కరు తలచుకుంటే మాత్రమే పోసానికి సినిమా ఆఫర్లు వస్తాయా.. ఏం జరిగిందంటే?

టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు నటుడు పోసాని కృష్ణ మురళి( Posani Krishna Murali ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

టాలీవుడ్ లో ఉన్న విలక్షణ నటుల్లో పోసాని కృష్ణమురళీ కూడా ఒకరు.కమెడియన్ గా నటుడిగా, దర్శకనిర్మాతగా రచయితగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు పోసాని.

తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు.కేవలం నెగిటివ్ క్యారెక్టర్ లలో మాత్రమే కాకుండా పాజిటివ్ క్యారెక్టర్ లలో కూడా నటించి మెప్పించారు.

అయితే కేవలం సినిమాల విషయంలోనే కాకుండా అప్పుడప్పుడు కాంట్రవర్సీలు క్రియేట్ చేసే విధంగా కామెంట్ చేస్తూ సోషల్ మీడియాలో నిలుస్తూ ఉంటారు.

"""/" / ఈ మధ్యకాలంలో ఆయన ఎటువంటి సినిమాలు నటించడం లేదు.ఇక అసలు విషయానికి వస్తే వైసిపీ అధినేత జగన్( YS Jagan ) కి పోసాని వీర విధేయుడు అని చెప్పాలి.

ఆ పార్టీ జెండా కూడా కప్పుకుని జగన్ ని ఎవరైనా ఏమైనా అంటే నోరొచ్చుకుని పడిపోతుంటాడు.

ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని, ఉప ముఖ్యమంత్రి పవన్ మీద చాలా దారుణమైన విమర్శలు చేసాడు.

వ్యక్తి గతంగా కూడా విమర్శలు చేసి అభాసుపాలు అయ్యాడు.అసలు వాటిని ఎవరు ఆక్షేపించరు కూడా.

మరి ఇప్పుడేమో వైసీపీ దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకుంది.పైగా ఇక కోలుకోవడం అనేది అసాధ్యం కూడా.

/br> """/" / పోసాని రాజకీయంగా ఖాళీగా ఉంటాడు.మరి ఈ పరిస్థితుల్లో తన జన్మ స్థలం సినిమాల్లోకి వస్తే మేకర్స్ ఆహ్వానిస్తారా అనేది అనుమానమే.

ఎందుకంటే కీర్తి శేషులు నందమూరి తారక రామారావు స్థాపించిన పార్టీ తెలుగుదేశం వైపు సినిమా వాళ్ళు ఎక్కువగా మొగ్గు చూపుతారు.

ఎందుకంటే సినిమాకి ఉన్న శక్తిని ప్రపంచానికి తెలియచేసింది ఆయనే కనుక.ఇక అగ్నికి ఆజ్యం జోడయినట్టు జనసేన కూడా సినీ నటుడు పవన్ దే కావడం వల్ల పోసానికి అవకాశం అనేది కష్టమే.

అంతిమంగా సినిమా గొప్పది కాబట్టి తనకి కావాల్సిన వన్నీ తన దగ్గరికే తెచ్చుకుంటుంది కాబట్టి పోసానికి అవకాశాన్ని కల్పిస్తుందేమో చూడాలి.

కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) తలచుకుంటే మాత్రమే ఆయనకు అవకాశాలు వస్తాయి అని చెప్పాలి.

బాలయ్య బాబీ మూవీకి ప్రచారంలో మరో టైటిల్.. ఇలాంటి టైటిల్ సూటవుతుందా?