Nandamuri Balakrishna: బాలయ్యకు శుక్రమహాదశ నడుస్తోందా.. ఈ స్టార్ హీరో కోసం ఇంతమంది నిర్మాతలు క్యూలో ఉన్నారా?
TeluguStop.com
టాలీవుడ్ నందమూరి నటసింహం హీరో బాలకృష్ణ( Nandamuri Balakrishna ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
బాలకృష్ణ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.వరుసగా ఒకదాని తర్వాత ఒకటి సినిమా అవకాశాలను అనుకుంటూ దూసుకుపోతున్నారు.
అంతేకాకుండా బాలయ్య బాబు నటించిన సినిమాలు అన్నీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలుస్తున్నాయి.
ఇంకా చెప్పాలంటే ఇప్పుడు బాలయ్య బాబుకి శుక్ర మహాదశ నడుస్తోందని చెప్పవచ్చు.దాంతో దర్శక నిర్మాతలు బాలయ్య బాబుతో సినిమాలు చేయడానికి పోటీ పడుతున్నారు.
ఇటీవలే భగవంత్ కేసరి( Bhagavanth Kesari ) సినిమాతో ప్రేక్షకులను పలకరించారు బాలయ్య బాబు.
భారీ అంచనాల నడుము విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది.ప్రస్తుతం బాలయ్య బాబు ఒకవైపు ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూనే అప్పుడే బాబీ దర్శకత్వంలో( Director Bobby ) రాబోయే సినిమా పనులు మొదలు పెట్టేశారు.
అయితే బాబీ సినిమా తరువాత బాలయ్య బాబు తదుపరి సినిమా ఎవరితో చేయబోతున్నాడు అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
"""/" /
బాలయ్యతో సినిమాలు చేయడానికి లైన్ లో చాలా మంది నిర్మాతలు ఉన్నారు.
అయితే ఎవరితో చేస్తారు అన్నది డిసైడ్ కావాల్సి వుంది.అగ్ర నిర్మాతలు దిల్ రాజు,( Dil Raju ) అల్లు అరవింద్( Allu Aravind ) ఇద్దరూ బాలకృష్ణతో సినిమా చేయాలని గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
దిల్ రాజుకు ఎప్పటి నుంచో బాలకృష్ణతో సినిమా చేయాలని కోరిక.ఆ కోరిక ఎప్పటికి తీరుతుందో తెలియదు.
వంశీ పైడిపల్లిని లైన్ లో అదే పని మీద ఉంచారు. """/" /
ప్రస్తుతం వంశీ పైడిపల్లి( Vamsi Paidipally ) ఒక మంచి కథను బాలయ్య కోసం తయారు చేసే పనిలో ఉన్నారు.
అల్లు అరవింద్ కు కూడా ఒక సినిమా బాలయ్యతో చేయాలని ఉంది.ఆయనకు వున్న అడ్వాంటేజ్ ఏమిటంటే బాలయ్య కు నచ్చిన దర్శకుడు బోయపాటి( Boyapati Srinu ) డేట్స్ అరవింద్ దగ్గరే వున్నాయి.
కానీ బోయపాటికి సూర్యతో ఒక సినిమా చేయాలని ఉంది.ఇలా మొత్తం మీద ఇద్దరు అగ్ర నిర్మాతలు బాలయ్య తో సినిమా చేయాలని కాస్త గట్టిగానే ప్రయత్నిస్తున్నారు.
వీరిలో బాలయ్య బాబు ఎవరికీ అవకాశం ఇస్తారో చూడాలి మరి.
వెండి పాత్రలను చిటికెలో మెరిపించే సూపర్ ఎఫెక్టివ్ చిట్కాలు మీకోసం!