Balakrishna : కంటి చూపుతో అందరినీ భయపెట్టే బాలయ్య ఆమె పేరు చెబితే వనికి పోతారా… ఆమె ఎవరంటే?
TeluguStop.com
తెలుగు సినీ ఇండస్ట్రీలో నందమూరి తారక రామారావు ఎంతటి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారో మనకు తెలిసిందే.
ఇలా ఇండస్ట్రీలో ఎంతో మంచే సక్సెస్ అందుకున్నటువంటి రామారావు వారసులుగా ఇండస్ట్రీలోకి పలువురు ఎంట్రీ ఇచ్చినప్పటికీ బాలకృష్ణ మాత్రమే ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు ఇలా ఎన్నో అద్భుతమైన సినిమాలలో హీరోగా నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి బాలకృష్ణ ( Balakrishna ) ప్రస్తుతం రాజకీయాలలో కూడా కొనసాగుతూ ఉన్నారు.
"""/" /
ఒకవైపు ఎమ్మెల్యేగా ఉంటూనే మరోవైపు వరస సినిమాలలో నటిస్తూ ప్రస్తుత యంగ్ హీరోలు అందరికీ గట్టి పోటీ ఇస్తున్నారు.
ఇక ఈ మధ్యకాలంలో బాలకృష్ణ నటించిన సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతో అద్భుతమైనటువంటి విజయాలను సొంతం చేసుకుంటున్నాయి.
ఈ ఏడాది మొదట్లో ఈయన వీర సింహారెడ్డి సినిమా( Veera Simha Reddy ) ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఇక దసరా పండుగ సందర్భంగా భగవంత్ కేసరి సినిమా( Bhagavanth Kesari Movie )ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు ఇక ఈ సినిమాపై కూడా ఎన్నో అంచనాలు పెరిగిపోయాయి.
"""/" /
ఇక నందమూరి బాలకృష్ణ సినిమాల విషయం పక్కనపెట్టి ఆయన వ్యక్తిగత విషయానికి వస్తే బాలయ్య అంటేనే చాలామంది భయంతో వనికి పోతూ ఉంటారు ఆయన కంటిచూపుతోనే అందరిని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటారని చెప్పాలి.
ఈ క్రమంలోనే బాలకృష్ణ ఎదుట చాలామంది ఎంతో భయంగా నడుచుకుంటూ ఉంటారు ఇలా బాలయ్య పేరు చెబితేనే అందరూ భయపడే ఈయన ఒక మహిళ పేరు చెబితే మాత్రం వనికిపోతారట.
మరి బాలయ్య భయపడేది ఎవరికి, ఆయను ఇలా కంట్రోల్లో పెట్టిన ఆ మహిళ ఎవరు అనే విషయానికి వస్తే.
"""/" /
బాలయ్య భయపడేది మరెవరికో కాదు తన తల్లి బసవతారకం గారికి మాత్రమేనని చెప్పాలి.
నందమూరి తారక రామారావు బసవ తారకం ( Basavatarakam ) దంపతులకు బాలకృష్ణ అంటే ఎంతో ప్రేమ అందరికంటే బాలయ్య చిన్నవాడు కావడంతో ఎన్టీ రామారావు ఈయనని చాలా ముద్దుగా గోమూ చేస్తూ పెంచారట అయితే తన తల్లి మాత్రం ఇలా గారాబం చేయకుండా ప్రతి విషయంలోనూ తనని క్రమశిక్షణగా పెంచాలని తనని కంట్రోల్ చేయాలని చూస్తూ ఉండే వారట అందుకే బాలయ్య ఎలాంటి అల్లరి పనులు చేసిన ఆమె శిక్ష వేస్తూ తనని కంట్రోల్ చేశారు.
అందుకే బాలకృష్ణకు తన తల్లి బసవతారకం అంటే చాలా భయం అని తెలుస్తుంది.
అయితే బసవతారకం గారు చనిపోయిన తర్వాత ఈయన కోపాన్ని కంట్రోల్ చేసేవారు ఎవరూ చెప్పాలి.
పట్టపగలు జలపాతం ఒడ్డున దెయ్యాలు ప్రత్యక్షం.. వీడియో చూస్తే జడుసుకుంటున్నారు..