Nagarjuna : పాకిస్తాన్ లో నాగార్జున.. నెలకు లక్షల్లో సంపాదన.. ఏం జరిగిందంటే?
TeluguStop.com
టాలీవుడ్( Tollywood ) ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నాగార్జున ( Nagarjuna ) ఒకరు.
ఈయన ప్రస్తుతం ఇండస్ట్రీలో కెరియర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతున్నారు.అయితే తాజాగా నాగార్జునకు సంబంధించి ఒక వార్త వైరల్ గా మారింది నాగార్జున పాకిస్తాన్( Pakistan ) లో నెలకు లక్షల్లో భారీగా సంపాదిస్తున్నారంటూ ఒక వార్త వైరల్ గా మారింది.
ఈ వార్త విన్నటువంటి అభిమానులు ఆదేంటి నాగార్జున హైదరాబాదులోనే ఉన్నారు కదా పాకిస్తాన్ లో ఏ పని అంటూ ఆరా తీయడం మొదలుపెట్టారు.
"""/" /
నాగార్జున పాకిస్తాన్లో ఉన్నారు అంటే స్వయంగా మన టాలీవుడ్ హీరో వెళ్లి పాకిస్తాన్లో ఉండడం కాదు నాగార్జున పోలికలతో ఉన్నటువంటి ఓ వ్యక్తి పాకిస్తాన్లో ఉండటం విశేషం.
ఈ ప్రపంచంలో మనిషిని పోలినటువంటి మనుషులు ఉంటారు అనడం సర్వసాధారణం.ఈ క్రమంలోనే పాకిస్థాన్ లో నాగార్జునను పోలినటువంటి ఓ వ్యక్తి ఉన్నారు.
అయితే ఈయన యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి ఏకంగా నెలకు లక్షల్లో ఆదాయం పొందుతున్నారని తెలుస్తుంది.
"""/" /
అచ్చం నాగార్జున పోలికలతో ఉన్నటువంటి ఈ వ్యక్తి పేరు జైన్ అక్మల్ ఖాన్ ( Jain Akmal Khan ) .
టీనేజ్ వయసు నుంచి అతను నాగార్జునలా ఉండటంతో ఈయనని చూసినవారు అచ్చం ఇండియన్ హీరోలా ఉన్నావు అంటూ కామెంట్లు చేసేవారట.
అతను షికారీ మాస్ ( Shikari Mass ) పేరుతో ఒక పుడ్ వ్లాగ్ ( Food Volg ) ను మొదలుపెట్టాడు.
అయితే ఈ వీడియోలు చూసిన కొంతమంది ఇండియన్స్ అచ్చం నాగార్జునలా ఉన్నారు అంటూ కామెంట్లు చేయడంతో ఈయన నాగార్జున గురించి తెలుసుకొని అచ్చం ఆయనలా తయారవుతూ వీడియోలు చేస్తూ ఉంటారు.
దీంతో ఈయన వీడియోలు కాస్త బాగా వైరల్ అయ్యాయి.నాగార్జున పోలికలతో ఉన్నటువంటి ఆయన గెటప్ లోనే వీడియోలు చేస్తూ బాగా పాపులారిటీ పొందడమే కాకుండా తన యూట్యూబ్ వీడియోల ద్వారా నెలకు లక్షల్లో సంపాదిస్తున్నారని తెలుస్తుంది.
ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి.