Sreeleela : ఆ విషయంలో శ్రీలీల మహేష్ ను డామినేట్ చేస్తుందా.. లుంగీ డాన్స్ హైలెట్ అంటూ?
TeluguStop.com
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు,( Mahesh Babu ) డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్( Trivikram Srinivas )కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా గుంటూరు కారం.
ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా పలు కారణాల వల్ల వాయిదా పడుతూనే వస్తోంది.
ఈ సినిమా కోసం మహేష్ బాబు అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.కాగా ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ లకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది.
ఇకపోతే ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే.భారీ బడ్జెట్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
"""/" /
మొదట్లో ఈ సినిమాపై బోలెడన్ని నెగిటివ్ గాసిప్స్ వినిపించడంతో ఈ సినిమా ఎలా ఉంటుందో అన్న అనుమానాలు కూడా రేకెత్తాయి.
కానీ త్రివిక్రమ్( Trivikram Srinivas ) ఎలాంటి పొరపాట్లు లేకుండా పక్కా ప్రణాళికతో వస్తున్నట్లుగా అర్థమవుతుంది.
కాగా ఈ సినిమాలోని మొదటి సాంగ్ ఆడియోస్ అందరినీ బాగా ఆకట్టుకుంటుందట.ఈ పాట ప్రేక్షకుల చేత విజిల్స్ కొట్టిస్తుందని ఇప్పటికే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
ఇది ఇలా ఉంటే తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ సినిమాలో మరొక పాట కూడా హైలెట్ కాబోతోందట.
ఆ పాటలో శ్రీలీల ( Sreeleela )మహేష్ ను డామినేట్ చేస్తుందా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి.
మహేష్ శ్రీలీల ఇద్దరు కూడా లుంగీ డ్యాన్స్ లో తీన్ మార్ స్టెప్పులు పోటాపోటీగా వేస్తారట.
"""/" /
ఇక మహేష్ ఇప్పటికే సరిలేరు నీకెవ్వరు, సర్కారు వారి పాట.
సినిమాల్లో అద్భుతమైన మాస్ సాంగ్స్ తో మెప్పించాడు.ఇక ఇప్పుడు గుంటూరు కారం సినిమాలో( Gunturu Kaaram Movie ) కూడా లుంగీ డాన్స్ ని అదరగొట్టబోతున్నట్టు తెలుస్తోంది.
కానీ ఈ విషయంలో శ్రీ లీల మహేష్ డాన్స్ ని డామినేట్ చేయబోతోంది అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి.
కాగా శ్రీ లీల మంచి డాన్సర్ అన్న విషయం కూడా మనందరికీ తెలిసిందే.
ఈ క్రమంలో మహేష్ బాబు కూడా ఆమెతో పోటీపడి చేయాల్సిన ఉంటుంది.బాబుకు మంచి క్రేజ్ ఉన్నప్పటికీ ఇప్పుడు శ్రీలీల టైం కూడా గట్టిగానే నడుస్తోంది.
కాగా శ్రీ లీలా ప్రస్తుతం నాలుగైదు సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉంది.
ఇటీవల టైగర్ నాగేశ్వరరావు సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.