ఆ స్టార్ హీరో ఇంటికి బాలయ్య తన రెండో కూతురిని కోడలిగా పంపించాలనుకున్నారా?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నందమూరి నటసింహ బాలకృష్ణ ( Balakrishna ) ఒకరు ఈయన స్వర్గీయ నందమూరి తారక రామారావు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు ఇలా తన తండ్రి వారసత్వాన్ని సినిమాలలోను రాజకీయాలలోను కొనసాగిస్తూ బాలకృష్ణ ప్రస్తుతం సినీ రాజకీయ రంగాలలో ఎంతో బిజీగా ఉన్నారు.

ఇక ఇప్పటికీ ఈయన వరుస సినిమాలలో నటిస్తూ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారని చెప్పాలి.

ఇలా బాలకృష్ణ వృత్తి పరమైన విషయం పక్కనపెట్టి వ్యక్తిగత విషయానికి వస్తే బాలకృష్ణ వసుంధరను వివాహం చేసుకున్నారు.

ఇక ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు అన్న సంగతి తెలిసిందే.

బాలకృష్ణ ఇద్దరు కుమార్తెలు కూడా విదేశాలలో చదువుకొని ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నారు.

ఇక వీరిద్దరూ చూడటానికి హీరోయిన్లకు ఏమాత్రం తీసుపోరు కానీ ఇవి ఇద్దరు మాత్రం సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు.

ఇక బాలకృష్ణ పెద్ద కుమార్తె బ్రాహ్మణి ( Brahmani )మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుమారుడు లోకేష్ణవివాహం చేసుకొని నారా వారి ఇంటి కోడలుగా అడుగుపెట్టారు.

చిన్న కుమార్తె తేజస్విని ( Tejaswini ) కూడా ప్రముఖ విద్యాసంస్థల అధినేతను వివాహం చేసుకొని ఉన్నత కుటుంబానికి కోడలుగా వెళ్లారు.

ఇక మోక్షజ్ఞ ( Mokshagna ) ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ లోకి రావడానికి శిక్షణ కూడా తీసుకుంటూ ఉన్నారు త్వరలోనే ఈయన సినిమా ఇండస్ట్రీలోకి రాబోతున్నారని తెలుస్తోంది.

"""/" / ఇదిలా ఉండగా తాజాగా బాలకృష్ణ చిన్న కుమార్తె గురించి ఒక వార్త వైరల్ గా మారింది ఈమెకు 2013 వ సంవత్సరంలో వివాహం చేశారు.

అయితే తేజస్విని బాలకృష్ణ మరో సినీ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబానికి కోడలుగా పంపించాలని భావించారట.

తెలుగు సినీ ఇండస్ట్రీలో అక్కినేని కుటుంబానికి ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి దీంతో అక్కినేని ఇంటికి తన కుమార్తెను కోడలుగా పంపించాలని భావించిన బాలకృష్ణ నాగార్జున ( Nagarjuna ) తో కలిసి ఈ విషయం గురించి మాట్లాడరట నాగచైతన్య( Nagachaitanya ) కు తన రెండవ కుమార్తెను ఇచ్చే వివాహం చేయడానికి బాలకృష్ణ ఎంతో ఆసక్తి చూపారు.

ఇక అందుకు నాగర్జున కూడా ఒప్పుకొని నాగచైతన్యతో ఈ విషయం గురించి ప్రస్తావించారట.

"""/" / ఇలా బాలయ్య కూతురి ప్రపోజల్ రావడంతో అప్పటికే నాగచైతన్య సమంత( Samantha ) ప్రేమలో ఉన్నారు ఇలా వీరిద్దరి ప్రేమ విషయాన్ని నాగర్జునకు చెప్పడంతో బాలకృష్ణ నాగార్జున ఇద్దరు కూడా వీరికి పెళ్లి చేయాలనే ఆలోచన విరమించుకున్నారు.

ఇక నాగచైతన్య సమంతను ప్రేమిస్తున్నారన్న విషయం తెలియడంతో బాలకృష్ణ తన కుమార్తెకు భరత్ అనే వ్యక్తిని ఇచ్చి అంగరంగ వైభవంగా వివాహం చేశారు.

ఇక నాగచైతన్య కూడా సమంతను ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు.అయితే సమంత నాగచైతన్య కొంతకాలం పాటు తమ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉన్నప్పటికీ అనంతరం విడాకులు తీసుకొని విడిపోయారు.

ఇలా సమంతను ప్రేమించకపోయి ఉంటే తప్పకుండా ఈయన నందమూరి ఇంటికి అల్లుడుగా అయ్యే వారని బాలకృష్ణ చిన్న కుమార్తె అక్కినేని కోడలు అయ్యేది అంటూ ఈ వార్త వైరల్ గా మారింది.

అమోఘం.. కొన్న సరుకులకు క్యారీ బ్యాగ్ ఇవ్వలేదని ఏకంగా?(వీడియో)