మళ్ళీ అదే తప్పు చేస్తానంటున్న మహానటి.. ఈమె కెరీర్ కోసం ఫ్యాన్స్ వర్రీ!
TeluguStop.com
కీర్తి సురేష్.సహజమైన నటనతో ప్రేక్షకులను తన వైపుకు తిప్పుకుంది ఈ మహానటిఈమె ఫస్ట్ సినిమాలో హిట్ కొట్టిన ఈమె నటనకు పెద్దగా పేరు రాలేదు.
కానీ కీర్తి సురేష్ మహానటి సినిమా చేసిన తర్వాత మాత్రం ఈమెను తెరమీద ఎవ్వరు చూడలేదు.
మహానటి సావిత్రి గారినే ఉహించు కున్నారు.అంతలా ఈమె సత్తా చాటింది.
ఈ సినిమాతో జాతీయ పురస్కారం అందుకుని జాతీయ నటిగా గుర్తింపు తెచ్చుకుంది.స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.
వరుస అవకాశాలు కూడా ఈ అమ్మడిని వరించాయి.అయితే ఆ తర్వాత నుండి ఈమె ఎంచుకునే పాత్రల కారణంగా కెరీర్ గాడి తప్పింది.
ఈమె చేస్తున్న సినిమాలన్నీ బ్యాక్ టు బ్యాక్ ప్లాప్ అవుతూ వస్తున్నాయి.ఈమె మహానటి తర్వాత కూడా మహిళా ప్రధాన పాత్రలనే ఎంచుకుంటూ ప్లాప్ లను ఎదుర్కొంటుంది.
పెంగ్విన్, గుడ్ లక్ సఖి వంటి సినిమాలు ప్లాప్ లను మూటగట్టుకున్నాయి. """/" /
అయినా కూడా ఈ అమ్మడు అదే తరహా సినిమాలను ఎంచుకుంటుంది.
ఇక ఈమె నటించిన సర్కారు వారి పాట ఇటీవలే రిలీజ్ అయ్యి హిట్ అయ్యింది.
మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కీర్తి కళావతి పాత్రలో నటించి మెస్మరైజ్ చేసింది.
ఈ సినిమా గురించి ఈమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడింది.సర్కారు వారి పాట సక్సెస్ పై ఆనందంగా ఉంది అంటూ తెలిపింది.
ఈ సినిమా తర్వాత తనకు మరిన్ని కమర్షియల్ సినిమాలు వస్తున్నాయని చెప్పింది.అయితే కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ నటిస్తూ ముందుకెళ్లడం తనకి చాలా ఇష్టమని అలాంటి కథలు వస్తే తప్పకుండ నటిస్తాను అంటూ చెప్పుకొచ్చింది.
ఇప్పుడిప్పుడే కెరీర్ పుంజుకుంటున్న సమయంలో ఇలాంటి స్టేట్ మెంట్ చేయడం పై ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మహిళా ప్రధాన సినిమాలు ఈమెకు కలిసి రాకపోయినా అవే చేస్తాననడం ఫ్యాన్స్ కు నచ్చలేదు.
మళ్ళీ అదే తప్పు చేస్తుంది అంటూ వాపోతున్నారు.ఇక ప్రెసెంట్ కీర్తి చేతిలో రెండు తెలుగు ప్రాజెక్ట్స్ ఉన్నాయి.
భోళా శంకర్ లో నటిస్తుంది.మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరు కు చెల్లెలి పాత్రలో కీర్తి నటిస్తున్నట్టు ఇప్పటికే అఫిషియల్ గా ప్రకటించారు.
అలాగే నాని హీరోగా నటిస్తున్న దసరా సినిమాలో కూడా ఈ అమ్మడు హీరోయిన్ గా నటిస్తుంది.
పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా 1000 కోట్ల కలెక్షన్స్ ను రాబడుతుందా..?