Animal : యానిమల్ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిస్తే నాని, నితిన్ సినిమాలకు ఇబ్బందేనా.. ఏమైందంటే?

ప్రస్తుతం బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు యానిమల్( Animal Movie )సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రణ్ బీర్ కపూర్, రష్మిక మందన కలిసి నటించిన విషయం తెలిసిందే.

డిసెంబర్ 1న విడుదల కాబోతున్న ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి అడ్వాన్స్ బుకింగ్ కూడా మొదలయ్యాయి.

తెలుగులో కూడా యానిమల్ సినిమా ఫీవర్ నడుస్తోంది.ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదల చేయగా ఆ ట్రైలర్ విడుదల తర్వాత ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

దీంతో ఈ సినిమా కోసం టాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

"""/" / ఈ సినిమా తప్పకుండా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అని మూవీ మేకర్స్ తో పాటు బాలీవుడ్ ప్రేక్షకులు టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ధీమాగా ఉన్నారు.

కాగా మూవీ విడుదల తేదీకి మరొక మూడు రోజులు మాత్రమే సమయం ఉండడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ ని మరింత వేగవంతం చేసింది.

ఇది ఇలా ఉంటే ఈ సినిమా కనుక బ్లాక్ బస్టర్ హిట్ అయితే తెలుగు సినిమాలకు ఇబ్బంది అవుతుంది అన్న వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

ఎందుకంటే డిసెంబర్ 6న ప్రీమియర్ లతో విడుదల అవుతోంది హీరో నాని( Nani ) సినిమా.

అలాగే డిసెంబర్ 8న నితిన్ నటించిన ఎక్స్ ట్రార్డినరీమాన్ మూవీ విడుదల అయ్యింది.

కాగా ఈ రెండింటిలో ఒకటి మాంచి క్లాస్ టచ్ ఎమోషనల్ సినిమా. """/" / రెండవది పక్కా రొటీన్ మాస్ కమర్షియల్.

అందువల్ల యానిమల్ సెన్సేషనల్ రేంజ్ లో జనాలను ఆకట్టుకుంటే మాత్రం ఈ తెలుగు సినిమాలు ఇబ్బంది పడడం ఖాయం అన్న వార్త ప్రస్తుతం టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

ఇలా నాని అలాగే నితిన్ సినిమాలు యానిమల్ సినిమా ఫలితాలపై డిపెండ్ అయి ఉన్నాయి.

ఒకవేళ యానిమల్ సినిమా కనుక బ్లాక్ బస్టర్ హిట్ అయితే పరిస్థితి సెన్సేషన్ గా ఉంటుందని చెప్పవచ్చు.

మరి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని నితిన్, నాని( Nithiin ) మూవీ మేకర్స్ విడుదల తేదీని పోస్ట్ బోన్ చేస్తారా లేదంటే అనుకున్న సమయానికి విడుదల చేస్తారా అన్నది చూడాలి మరి.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బాద్ షా సినిమా కోసం సాయం చేసిన ముగ్గురు స్టార్స్ వీళ్లే!