10 సినిమాలు కూడా చేయకుండానే 50 కోట్ల పారితోషికమా?

ప్రస్తుతం టాలీవుడ్‌లో క్రేజీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ.డియర్‌ కామ్రేడ్‌ చిత్రం నిరాశ పర్చినా కూడా ఈయన ప్రస్తుతం చేస్తున్న వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.

అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు క్రాంతి మాధవ్‌ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్‌ చిత్రంపై అంచనాలు పెంచేసింది.

ఇదే సమయంలో విజయ్‌ దేవరకొండ పారితోషికం విషయమై చర్చ జరుగుతోంది. """/" /ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాణ సంస్థ యశ్‌ రాజ్‌ ఫిల్మ్‌ విజయ్‌ దేవరకొండతో సినిమాలను నిర్మించేందుకు ప్రయత్నాలు చేస్తుందట.

తెలుగు మరియు హిందీ భాషల్లో రెండు సినిమాలను చేసేందుకు ఈ నిర్మాణ సంస్థ ఏర్పాట్లు చేస్తుందని, అందుకోసం విజయ్‌ దేవరకొండకు ఏకంగా 50 కోట్ల రూపాయలను ఆఫర్‌ చేసింది అంటూ సమాచారం అందుతోంది.

ఇప్పటి వరకు 10 సినిమాలు కూడా పూర్తి చేయని విజయ్‌ దేవరకొండ ఇంత భారీ డీల్‌ను కమిట్‌ అయ్యాడా లేదా అనేది తెలియాల్సి ఉంది.

"""/" /గత కొంత కాలంగా విజయ్‌ దేవరకొండ బాలీవుడ్‌ ఎంట్రీ విషయమై చర్చలు జరుగుతున్నాయి.

కాని ఇప్పటి వరకు సెట్‌ అవ్వలేదు.మొదటగా కరణ్‌ జోహార్‌ విజయ్‌ దేవరకొండతో సినిమాను చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి.

కాని కరణ్‌ జోహార్‌ నిర్మాణంలో విజయ్‌ దేవరకొండ సినిమా సెట్‌ అవ్వలేదు.మరి యశ్‌ రాజ్‌ ఫిల్మ్‌ వారికి అయినా విజయ్‌ దేవరకొండ ఓకే చెప్తాడా 50 కోట్లను అందుకుంటాడా చూడాలి.

తల్లి పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరిపిన చిరు… స్పెషల్ అట్రాక్షన్ గా చరణ్!