బన్నీ త్రివిక్రమ్ కాంబో మూవీపై పెరుగుతున్న అంచనాలు.. బాక్సాఫీస్ షేక్ కావడం పక్కా!
TeluguStop.com
ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా అల్లు అర్జున్( Allu Arjun ) త్రివిక్రమ్( Trivikram ) కాంబినేషన్ లో రాబోతున్న సినిమాకు సంబంధించి ఎక్కువగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.
వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా ఫిక్స్ అయిపోయినట్లే అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
పుష్ప 2( Pushpa 2 ) సినిమా తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోతున్న సినిమాలు నటించనున్నారు అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
అయితే దర్శకుడు అట్లీతోపాటు చాలామంది దర్శకుల పేర్లు వినిపించినప్పటికీ అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా మాత్రం త్రివిక్రమ్ తో అని తెలుస్తోంది.
"""/" /
అయితే జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో లాంటి మూడు హిట్ లు కొట్టిన తరువాత చేసే సినిమా కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి.
అలాగే ఇప్పుడు సినిమా మారిపోయింది.పాన్ ఇండియా సినిమా,( Pan India Movie ) ఎవరికి వారు ఒక వరల్డ్ క్రియేట్ చేసి చూపిస్తున్నారు.
ఇప్పుడు త్రివిక్రమ్ వంతు వచ్చింది.త్రివిక్రమ్ ఇప్పుడు తన సినిమాను తెలుగు రాష్ట్రాల బోర్డర్ దాటించాలి.
అలాంటి రేంజ్ కథ ఉండాలి.అయితే ఇప్పటి వరకు త్రివిక్రమ్ రాసిన కథలు అన్నీ మన ఇంట్లోనే మన పాత్రల చుట్టూ, తిప్పుతూ తిప్పి తిప్పి అవే కథలు చెబుతూ వస్తున్నారు.
ఇప్పుడు వాటితో పని జరగదు.కానీ తన తదుపరి విషయం సినిమాల విషయంలో మాత్రం అది వర్కౌట్ కాదని చెప్పాలి.
"""/" /
ఈ విషయం ఇద్దరికీ అర్థమయ్యే ఉంటుంది.ఇప్పటికే ఈ సినిమా గురించి బన్నీ సన్నిహితుడు బన్నీ వాస్( Bunny Vas ) చాలా చెప్పారు.
వందల కోట్ల ప్రాజెక్ట్ అని, దీనికి డబ్బులు కావాలంటే చాలా పెద్ద సంస్థల ఫండింగ్ కావాలని, ప్రీ ప్రొడక్షన్ కే నెలలు పడుతుంది అంటూ ఇంకా ఈ సినిమా గురించి చాలా చెప్పారు.
అలాంటి ప్రాజెక్ట్ కు కథేంటీ అని అరా తీస్తే.మైథలాజికల్ టచ్ సోషియో ఫాంటసీ సినిమా అని, త్రివిక్రమ్ ఒక అద్భుతమైన మైథలాజికల్ టచ్ వుండే లైన్ ను బన్నీ కి చెప్పినట్లు తెలుస్తోంది.
అది కూడా చానాళ్ల క్రిందటే అని చెప్పాలి.దానికి బన్నీ కూడా ఓకె చెప్పడం, అప్పటి నుంచి అదే లైన్ ను కథగా మార్చే పనిలో బిజీగా వుండడం జరుగుతోంది.
ఇప్పుడు అదే సినిమాగా మారబోతోంది.ఈ సినిమాకు నాలుగు నుంచి అయిదు వందల కోట్లు ఖర్చు ఉంటుందని గట్టిగానే వినిపిస్తోంది.
మొత్తంగా చూసుకుంటే అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ మూవీ పట్టా లెక్కక ముందే అంచనాలను ఒక రేంజ్ లో పెంచేస్తోంది.
నీటి కోసం వెళ్లిన సింహానికి మొసలి ఊహించని షాక్.. వీడియో వైరల్..