Mahesh Babu : వామ్మో ….మహేష్ బాబు వయసు మరీ 25 ఏళ్లేనా…. దట్ ఇస్ మహేష్ అంటున్న ఫ్యాన్స్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి వారిలో సూపర్ స్టార్ మహేష్ బాబు ( Mahesh Babu ) ఒకరు.

సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినటువంటి మహేష్ బాబు అనంతరం హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.

ఇలా వరుస తెలుగు సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.

మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమా( Guntur Karam Movie ) షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకులకు రావడానికి సిద్ధమవుతుంది.

ఈ సినిమా తర్వాత మహేష్ బాబు రాజమౌళి ( Rajamouli )దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ పనులలో బిజీ కాబోతున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులలో రాజమౌళి ఎంతో బిజీగా ఉన్నారు.

మహేష్ బాబు ఎంతో బిజీగా ఉన్నప్పటికీ తన వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో సంతోషంగా ఉన్న విషయం మనకు తెలిసిందే.

తన భార్య పిల్లలతో ఈయన తన జీవితాన్ని చాలా సంతోషంగా గడుపుతున్నారు.మహేష్ బాబుకి విపరీతమైనటువంటి అమ్మాయిల ఫాన్ ఫాలోయింగ్ ఉంది అనే విషయం మనకు తెలిసిందే.

ప్రస్తుతం మహేష్ బాబు నాలుగు పదుల వయసు దాటిపోతున్నప్పటికీ ఇంకా పాతికేళ్ల కుర్రాడిలాగే చాలా స్టైలిష్ లుక్ లో అలాగే అంతే ఫిట్ గా కనిపిస్తూ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు.

అందం గురించి ఎంతోమంది సెలబ్రిటీలు పొగుడుతూనే ఉంటారు.చూడటానికి పాతికేల్లు కుర్రాడులా ఉండే మహేష్ బాబు వయసు 48 సంవత్సరాలు అయినప్పటికీ ఈయన అంత వయసున్న వ్యక్తిగా ఏ మాత్రం కనిపించరు.

అయితే మహేష్ బాబు ఫోటో తీసుకొని లండన్ లో ఉన్నటువంటి వ్యక్తులను ఈయన వయసు ఎంత అని అడగడంతో వారు మహేష్ బాబు వయసు చెప్పడం చూస్తే కనుక ఆశ్చర్య వ్యక్తం చేయక మానదు.

"""/" / ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఒక యాంకర్ లండన్ ( London )లో ఉన్నటువంటి కొందరిని మహేష్ బాబు ఫోటో చూయించి మీరు ఈయన వయసు ఎంత ఉంటుంది అనుకుంటున్నారు అని ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు వారంతా సమాధానం చెబుతూ 25 సంవత్సరాలు 28 అంటూ ప్రతి ఒక్కరు కూడా 30 సంవత్సరాల లోపే మహేష్ బాబు వయసు చెప్పారు కానీ మహేష్ బాబు నిజమైనటువంటి వయసు 48 సంవత్సరాలు అని యాంకర్ చెప్పడంతో ఒక్కసారిగా అక్కడున్నటువంటి వారందరూ కూడా షాక్ అయ్యారు.

"""/" / మహేష్ బాబు నిజమైన వయసుకి ఆయన పోలికలకు ఏమాత్రం పొంతన లేదు ఆయన వయసు 48 సంవత్సరాలు అయినప్పటికీ పాతికేళ్ల కుర్రాడులాగే ఉంటారని చెప్పాలి.

ఇలా తమ సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఇంకా పాతికళ్లేనా అంటూ లండన్ కి చెందినటువంటి వ్యక్తులు చెప్పడంతో మహేష్ బాబు అభిమానులు మాత్రం భలే సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

అక్కడున్నదేవడ్రా మా మహేష్ అంటూ కొందరు కామెంట్లు చేయగా ఈయనకు వయసు పెరుగుతుంటే అందం కూడా రెట్టింపు అవుతుంది దట్ ఇస్ మహేష్ అంటూ మరికొందరు ఈ వీడియో పై కామెంట్స్ చేస్తున్నారు.

క్రిస్మస్ స్టాకింగ్‌లో లాటరీ టికెట్.. ఒక్క రాత్రిలో కోటీశ్వరురాలైంది..!