వి కి గుమ్మడి కాయ కొట్టిన నాని...

తాజాగా నాచురల్ స్టార్ నాని ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వం వహిస్తున్నటువంటి "వి" అనే చిత్రంలో నటిస్తున్నాడు.

ఈ చిత్రంలో నానితో పాటూ నివేదా థామస్, అతిథి రావు హైదరి, సుధీర్ బాబు వంటివారు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు.

అయితే ఈ చిత్రానికి సంబంధించినటువంటి షూటింగ్ ఈరోజుతో పూర్తయింది. దీంతో హీరో నాని ఈ చిత్ర షూటింగ్ పూర్తయిన సందర్భంగా గుమ్మడికాయ కొట్టి ముగింపు పలికారు.

ఈ విషయాన్ని నాచురల్ స్టార్ నాని తన సోషల్ మీడియా సామాజిక మాధ్యమ అయినటువంటి ట్విట్టర్ అధికారిక ఖాతా ద్వారా తెలిపారు.

అయితే ఇప్పటివరకు ఈ చిత్రానికి సంబంధించిన వార్తలేమి బయటి ప్రపంచానికి తెలియకుండా చాలా సైలెంట్ గా ఈ చిత్రం చిత్రీకరణ పూర్తి చేసుకుంది.

అయితే ఈ చిత్రాన్ని ఉగాది పండుగ కానుకగా మార్చి నెలలో విడుదల చేసేందుకు దర్శకుడు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ చిత్రం ఓ థ్రిల్లర్ సస్పెన్స్ గా ఉండబోతున్న ట్లు ఇప్పటికే పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

"""/"/ అయితే గతేడాది జెర్సీ సినిమాతో నాని బాగానే ఆకట్టుకున్నా ఈ ఏడాదిలో వచ్చినటువంటి గ్యాంగ్ లీడర్ తో మాత్రం తన అభిమానులను  అంతగా మెప్పించలేకపోయాడు.

అయితే తాజాగా నాని శివ నిర్వాణ దర్శకత్వంలో జగదీశ్ అనే చిత్రంలో నటిస్తున్నాడు.

 ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్లు కూడా విడుదలయ్యాయి.అంతేగాక ఈ చిత్రానికి సంబంధించిన పలు కీలక సన్నివేశాలు కూడా చిత్రీకరణ పూర్తి చేసినట్లు దర్శకులు పలు సందర్భాల్లో తెలిపాడు.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?