శంకర్ కూతురు పెళ్లిలో కీర్తి సురేష్ కట్టుకున్న చీర ఖరీదు ఎంతో తెలుసా?

హీరోయిన్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటి కీర్తి సురేష్ ఒకరు.

ఈమె తెలుగులో నేను శైలజ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమా ద్వారా తనను అందరిని ఆకట్టుకున్నటువంటి కీర్తి సురేష్( Keerthy Suresh) అనంతరం వరుస సినిమా అవకాశాలను అందుకుంటు కెరియర్ పరంగా ఎంతో బిజీగా మారిపోయారు.

ఇలా నటిగా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె మహానటి సినిమా(Mahanati)తో ఏకంగా ఉత్తమ జాతీయ నటి అవార్డును సైతం అందుకున్నారు.

కీర్తి సురేష్ ఈ విధంగా తెలుగు తమిళ భాష చిత్రాలలో ఎంతో బిజీగా గడిపారు.

అయితే ప్రస్తుతం ఈమె బాలీవుడ్ సినిమాలలోకి కూడా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఇలా బాలీవుడ్ సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె సోషల్ మీడియా వేదికగా కూడా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా కీర్తి సురేష్ ప్రముఖ డైరెక్టర్ శంకర్ కుమార్తె వివాహపు (Shankar Daughter Wedding)వేడుకలలో సందడి చేశారు.

డైరెక్టర్ శంకర్ తన కుమార్తె పెళ్లి వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే.

"""/" / తన కుమార్తె పెళ్లి వేడుకలను ఎంతో కన్నుల పండుగగా చేశారు.

ఈ వివాహ వేడుకకు టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ బాలీవుడ్ సినీ సెలబ్రిటీలు మొత్తం హాజరై సందడి చేశారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి.

ఈ క్రమంలోనే కీర్తి సురేష్ సైతం ఈ పెళ్లి వేడుకలలో పాల్గొని సందడి చేశారు.

"""/" / ఇక ఈ పెళ్లి వేడుకలకు కీర్తి సురేష్ ఎంతో అందంగా ముస్తాబయి వచ్చారు చీరకట్టులో అందంగా కనిపించినటువంటి కీర్తి సురేష్ చీర అందరి దృష్టిని ఆకర్షించింది ఈ క్రమంలోనే కీర్తి సురేష్ కట్టినటువంటి ఈ చీర ఖరీదు ఎంత అని ఆరా తీయడం మొదలుపెట్టారు అయితే ఈ పెళ్లి వేడుకలలో కీర్తి సురేష్ కట్టుకున్నటువంటి ఈ చీర ఖరీదు అక్షరాల 2,99,000 రూపాయలు అని తెలుస్తుంది.

ఇలా భారీ ఖరీదు కలిగిన చీరతో శంకర్ కూతురు వివాహానికి కీర్తిసురేష్ అటెండ్ అయినట్టు తెలుస్తుంది.

"""/" / ఇలా ఈమె కట్టిన చీర ఖరీదు ఇన్ని లక్షల అని తెలియగానే అందరూ ఆశ్చర్యపోతున్నారు అయితే సెలబ్రిటీలు ఈ విధమైనటువంటి ఖరీదైన బ్రాండెడ్ వస్తువులను ఉపయోగించడం సర్వసాధారణం.

ఇక కీర్తి సురేష్ సినిమాల విషయానికొస్తే తెలుగులో ఈమె చివరిగా హీరో నాని నటించిన దసరా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకుంది.

ఇక ప్రస్తుతం ఈమె బాలీవుడ్ సినిమాల షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.

దళితులపై అధ్యయనాలు.. భారత సంతతి మహిళా ప్రొఫెసర్‌కు ‘యూఎస్ జీనియస్ గ్రాంట్ ’