Lakshmi Pranathi , Ntr : ఇద్దరి పుట్టినరోజు ఒకే రోజేనా.. ఎన్టీఆర్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటుడు ఎన్టీఆర్( Ntr ) ఒకరు.

ఈయన హీరోగా ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైనటువంటి సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.ఇక ఇటీవల రాజమౌళి దర్శకత్వంలో నటించిన RRR సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయినటువంటి ఎన్టీఆర్ ప్రస్తుతం తన సినిమాలన్నిటిని కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.

ఇక ఈయన తెలుగు సినిమాలో మాత్రమే కాకుండా బాలీవుడ్ సినిమాలకు కూడా కమిట్ అవుతున్న సంగతి మనకు తెలిసిందే.

ఇలా కెరియర్ పరంగా ఎన్టీఆర్ ఎంతో బిజీ అయ్యారు.ఇక ఈయన వ్యక్తిగత విషయానికి వస్తే లక్ష్మీ ప్రణతి ( Lakshmi Pranathi ) అనే అమ్మాయిని వివాహం చేసుకొని తన వ్యక్తిగత జీవితంలో కూడా ఎన్టీఆర్ ఎంతో సంతోషంగా గడుపుతున్నారు.

ఇటీవల ప్రణతి పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ కి సంబంధించినటువంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

"""/" / లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు మార్చ్ 26వ తేదీ అనే విషయం అందరికీ తెలిసిందే.

అయితే తన భార్య పుట్టినరోజు తన పుట్టినరోజు ( Birthday )అంటూ ఎన్టీఆర్ గతంలో చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించినటువంటి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అసలు ఎన్టీఆర్ పుట్టినరోజు ప్రణతి పుట్టినరోజు ఒక్కటే ఏంటి అనే విషయానికి వస్తే.

ఎన్టీఆర్ 2009 ఎలక్షన్స్ సమయంలో తెలుగుదేశం పార్టీ తరపున ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే.

ఇలా ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్నటువంటి ఎన్టీఆర్ వెళ్తున్న వాహనానికి ఘోరమైనటువంటి రోడ్డు ప్రమాదం జరిగింది.

ఈ ప్రమాదంలో ఎన్టీఆర్ చాలా గాయపడ్డారు అయితే ఈ ఘోర ప్రమాదం నుంచి ఎన్టీఆర్ బయటపడటం అనేది నిజంగా తన అదృష్టం అనే చెప్పాలి ఇలా తాను ఈ ప్రమాదం నుంచి బయటపడటం తనకు ఇది మరో పునర్జన్మ లాంటిదని ఎన్టీఆర్ తెలిపారు.

"""/" / సరిగ్గా ఈ ప్రమాదం మార్చి 26వ తేదీ జరిగిందని ఎన్టీఆర్ తెలిపారు.

అయితే ఆ రోజును నేను నా పునర్జన్మగా భావిస్తాను అయితే అనుకోకుండా అదే రోజు నా భార్య ప్రణతి పుట్టినరోజు కావటం విశేషం.

ఇలా ప్రణతి పుట్టినరోజు, నేను పునర్జన్మ పొందిన రోజు రెండు ఒకటే కావడంతో మార్చి 26వ తేదీనే నా పుట్టినరోజుగా భావిస్తానని ఈయన తెలిపారు.

అయితే ఇదంతా చాలా యాదృచ్ఛికంగా జరిగిందని అంత దైవ నిర్ణయంతోనే జరిగింది అంటూ ఎన్టీఆర్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

శిశువు ప్రాణం అద్భుతంగా కాపాడిన డాక్టరమ్మ.. ఈ వీడియో చూస్తే ఏడ్వకుండా ఉండలేరు!