తండ్రి అయిన తరువాత అల్లు అర్జున్ లో ఇంత మార్పు వచ్చిందా..ఆ అలవాటు మానుకున్నారా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు అల్లు అర్జున్( Allu Arjun ) ఒకరు ఇలా అల్లు అరవింద్ ( Allu Aravind ) వారసుడిగా ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టినటువంటి ఈయన తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

అయితే సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా( Pushpa 2 )ద్వారా ఈయన పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమా అల్లు అర్జున్ కెరియర్ కు టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో ఈయన క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.

ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ ఎంతో అద్భుతంగా నటించి అందరిని మెప్పించారు.

ఈ సినిమాలో ఈయన నటనకు గాను ఏకంగా జాతీయ ఉత్తమ నటుడు అవార్డును కూడా అందుకున్న విషయం మనకు తెలిసిందే.

కెరియర్ పరంగా అల్లు అర్జున్ ఎంతో మంచి సక్సెస్ అందుకొని పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నారని చెప్పాలి.

ఇక కెరియర్ లో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అల్లు అర్జున్ వ్యక్తిగత జీవితంలో కూడా తన భార్య పిల్లలతో ఎంతో సంతోషంగా గడుపుతున్నారు.

"""/" / స్నేహారెడ్డి( Sneha Reddy ) అనే అమ్మాయిని ప్రేమించి పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నటువంటి అల్లు అర్జున్ దంపతులకు ఇద్దరు పిల్లలు అనే విషయం తెలిసిందే.

అల్లు అర్జున్ తన పిల్లల పట్ల ఎంతో ప్రేమ చూపిస్తూ తరచూ ఆయనకు వీలు కుదిరినప్పుడల్లా ఆ సమయం పిల్లలతో కేటాయించడానికి ఇష్టపడుతూ ఉంటారు.

వీరికి సంబంధించిన వీడియోలన్నింటినీ కూడా అల్లు అర్జున్ స్నేహారెడ్డి సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు.

ఒక కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అల్లు అర్జున్ కు తమ పిల్లల గురించి కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి.

పెళ్లి తర్వాత పిల్లలు పుట్టి తండ్రిగా ప్రమోట్ అయిన తర్వాత మీలో వచ్చిన మార్పు ఏంటి అనే ప్రశ్న అల్లు అర్జున్ కు ఎదురయింది.

"""/" / ఈ ప్రశ్నకు అల్లు అర్జున్ సమాధానం చెబుతూ పెళ్లి కాకముందు తనకి ఇష్టం వచ్చిన విధంగా నేను ఉండేవాడిని అంతేకాకుండా నా నోటి వెంట బూతులు ఎక్కువగా వచ్చేవి.

పిల్లలు పుట్టిన తర్వాత బూతులు మాట్లాడటం చాలా వరకు తగ్గించాను అంటూ అల్లు అర్జున్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఈ విషయం తెలిసిన నేటిజన్స్ అలాగే అభిమానులు అల్లు అర్జున్ కి బూతులు మాట్లాడే అలవాటు కూడా ఉందా అంటూ ఆశ్చర్యపోతున్నారు.

ఇక పిల్లలు పుట్టిన తర్వాత ఆ అలవాటును పూర్తిగా మానుకున్నాను అంటూ అల్లు అర్జున్ చెప్పడంతో చాలా మంచి పని చేశారు అంటూ నేటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు.

అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన పుష్ప 2 సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.

ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో మరో పాన్ ఇండియా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

భారత్ బెస్ట్ అయితే అక్కని అమెరికాకు ఎందుకు.. కుర్రాడి క్వశ్చన్‌తో MTV యాడ్ సెన్సేషన్!