Allu Arjun : ఆ విషయంలో అల్లు అర్జున్ ను బీట్ చేసే హీరో సౌత్ లో లేరా.. మరో రికార్డ్ సాధించిన బన్నీ?
TeluguStop.com
సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్( Allu Arjun ) ఒకరు.
ఈయన హీరోగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.అల్లు అరవింద్ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినటువంటి అల్లు అర్జున్ గంగోత్రి ( Gangotri ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆర్య సినిమాతో మంచి హిట్ అందుకున్నారు.
ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేసినటువంటి అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప ( Pushpa ) సినిమాలో నటించారు.
ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇక ఈ సినిమా విడుదలైన తరువాత అల్లు అర్జున్ రేంజ్ పుష్ప ముందు పుష్ప తర్వాత అనే లాగా మారిపోయింది అని చెప్పాలి.
ఈ సినిమాకు పాన్ ఇండియా స్థాయిలో ఎంత ఆదరణ వచ్చిందో ఈయనని అభిమానించే వారి సంఖ్య కూడా అదే స్థాయిలో ఉందని చెప్పాలి.
ఈ విధంగా పవన్ కళ్యాణ్ ను అభిమానించే వారు మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో ఈయనని అనుసరించే వారి సంఖ్య కూడా రోజు రోజుకు పెరుగుతూ వచ్చింది.
"""/" /
ఇక పుష్ప సినిమా ఎంతో మంచి సక్సెస్ కావడంతో ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ చిత్రంగా పుష్ప 2 సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు.
ఈ సినిమా ఆగస్టు 15వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.ఇక ఈ సినిమా షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
ఇదిలా ఉండగా తాజాగా అల్లు అర్జున్ కి సంబంధించి ఒక వార్త వైరల్ గా మారింది.
అల్లు అర్జున్ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారనే సంగతి మనకు తెలిసిందే.
"""/" /
ఈ క్రమంలోనే ఈయన సోషల్ మీడియా వేదికగా చేస్తున్న పోస్ట్ వైరల్ గా మారింది.
ఇంస్టాగ్రామ్ లో అల్లు అర్జున్ ని అనుసరించే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ వచ్చింది అయితే తాజాగా ఈయన 25 మిలియన్ ఫాలోవర్స్ నే సొంతం చేసుకున్నారు ఇక ఇదే విషయాన్ని అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ తన అభిమానులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ విధంగా సౌత్ ఇండస్ట్రీలోనే అత్యధిక ఫాలోవర్స్ కలిగి ఉన్నటువంటి ఏకైక నటుడిగా అల్లు అర్జున్ పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు.
ఈ విషయంలో ఈయనని బీట్ చేసేవారు లేరని ఈయన తర్వాతి స్థానంలో అదే స్థాయిలో అభిమానులను సొంతం చేసుకున్న నటుడిగా విజయ్ దేవరకొండ ఉన్నారని చెప్పాలి.
వైరల్ వీడియో: బహిరంగంగా రొమాన్స్ చేస్తూ రెచ్చిపోయిన యువత..