హీరోయిన్ నమిత అంత బరువు పెరగడానికి ఆ వ్యాధి కారణమా?
TeluguStop.com
టాలీవుడ్( Tollywood ) ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి నమిత( Namitha ) ఒకరు.
సొంతం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈమె అనంతరం జెమిని బిల్లా వంటి పలు సినిమాలలో నటించారు.
ఇలా తెలుగులో పలు సినిమాలలో నటిస్తూ ఉన్నటువంటి ఈమె అనుకోకుండా అధిక శరీర బరువు పెరిగిపోయారు.
ఇలా అధిక శరీర పరువు కారణంగా తెలుగులో ఈమెకు హీరోల పక్కన హీరోయిన్గా అవకాశాలు కాకుండా సినిమాలలో ఏదో చిన్న చిన్న పాత్రలో అవకాశం కల్పించేవారు.
ఈ విధంగా నమిత పలు సినిమాలలో నటించిన పెద్దగా ప్రాధాన్యత రాకపోవడంతో ఈమె తెలుగు సినిమా ఇండస్ట్రీకి పూర్తిగా దూరమయ్యారు.
ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి నమిత తమిళంలో సినిమా ప్రయత్నాలు చేశారు.
అయితే అక్కడ కుర్ర హీరోల నుంచి మొదలుకొని స్టార్ హీరోల వరకు అవకాశాలు అందుకొని దూసుకుపోయారు.
తమిళనాడులో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగినటువంటి నమితకు అక్కడ ఏకంగా గుడి కూడా కట్టేశారు.
"""/" /
తమిళ చిత్ర పరిశ్రమలో కుష్బూ తర్వాత నమితకు అభిమానులు గుడి కట్టి పూజించారు.
ఆ స్థాయిలో ఈమె సినిమా అవకాశాలను అందుకొని ప్రేక్షకులను సందడి చేశారు.అయితే క్రమక్రమంగా ఈమెకు తమిళంలో( Tamil ) కూడా అవకాశాలు తగ్గిపోయాయి.
రోజురోజుకు తన శరీర బరువు పెరగటమే అందుకు కారణమని చెప్పాలి.హీరోయిన్లు శరీర బరువు విషయంలో చాలా జాగ్రత్తలు పాటిస్తూ ఉంటారు.
ముఖ్యంగా స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్నటువంటి వారు ఫిట్నెస్ విషయంపై ఎంతో కేర్ తీసుకుంటారు.
"""/" /
ఈ విధంగా నమిత తన ఫిట్నెస్ విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న కూడా అధిక శరీర బరువు పెరిగిపోతూ వచ్చారు.
తద్వారా ఈమెకు సినిమా అవకాశాలు కూడా కరువయ్యాయి.అయితే ఈమె శరీర బరువు పెరగడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే.
నమిత పూర్తిగా డిప్రెషన్, థైరాయిడ్ ( Depression, Thyroid )వంటి సమస్యలతో బాధపడ్డారట ఈ సమస్యల కారణంగానే ప్రతిరోజు మందులు వాడటం వల్ల ఈమె అధిక శరీర బరువు పెరిగిపోయారని తెలుస్తుంది.
ఇలా శరీర బరువు కారణంగా సినిమా అవకాశాలు లేకపోవడంతో నమిత 2017 వ సంవత్సరంలో వీరేంద్ర చౌదరి ( Veerendra Chowdary ) అనే వ్యక్తిని తిరుపతిలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు.
ఇలా వివాహమైనటువంటి ఈమె పూర్తిగా వైవాహిక జీవితంలో స్థిరపడ్డారు.ఇక ఈ దంపతులకు గత ఏడాది కవల మగ పిల్లలు జన్మించిన సంగతి తెలిసిందే.
కెమెరాలో చిక్కిన సీక్రెట్ మూమెంట్.. మెలానియా ట్రంప్‌కు గవర్నర్ ముద్దు.. వీడియో వైరల్..