50 రోజుల్లో మూడు డిజాస్టర్లు.. రాజ్ తరుణ్ సినీ కెరీర్ ప్రమాదంలో పడినట్లేనా?

తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

ఇటీవల కాలంలో కేవలం సినిమాల విషయంలో మాత్రమే కాకుండా పర్సనల్ విషయాల్లో లవ్ విషయంలో ఎక్కువగా వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే.

మరోవైపు బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు.ఇకపోతే కెరియర్ ఆరంభంలో ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్తా మావ, కుమారి 21 ఎఫ్‌ చిత్రాలతో హ్యాట్రిక్ హిట్లు కొట్టి మంచి డిమాండ్ తెచ్చుకున్న రాజ్ తరుణ్( Raj Tarun ) ఆ తర్వాత కొన్ని సినిమాలలో నటించినప్పటికీ అవి ఆశించిన ఫలితాలను రాబట్టలేకపోయాయి.

"""/" / ఒక దశ దాటిన తర్వాత అతడికి వరుసగా ఫ్లాపులు ఎదురయ్యాయి.

అయితే తర్వాత మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చిన అతను గత 50 రోజుల్లో మూడు చిత్రాలతో ప్రేక్షకులను పలకరించాడు.

ఈ మూడు కూడా తీవ్ర నిరాశనే మిగిల్చాయి.అతను లావణ్య చౌదరి( Lavanya Chaudhary )తో వ్యక్తిగత వివాదం కారణంగా మీడియాలో నిలుస్తున్న సమయంలోనే జులై 26వ తేదీన రాజు తరుణ్ నటించిన పురుషోత్తముడు సినిమా సడన్గా థియేటర్లోకి విడుదల అయ్యింది.

ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా కొద్ది రోజులు కూడా ఆడలేదు.

ఆ తర్వాత మళ్లీ వారం రోజులకే తిరగబడరా స్వామి( Tiragabadara Saami ) అంటూ మరో సినిమాతో ప్రేక్షకులను పలకరించారు రాజ్ తరుణ్.

ఈ సినిమా కూడా ఆశించిన ఫలితాలని రాబట్ట లేకపోయింది. """/" / దారుణమైన రివ్యూలు నెగిటివ్ టాక్ రావడంతో ప్రేక్షకులు థియేటర్ వైపు చూడడమే మానేశారు.

దాంతో సినిమా అడ్రస్ లేకుండా పోయింది.ఆ తర్వాత 40 రోజులు గ్యాప్ ఇచ్చి లేటెస్ట్‌గా భలే ఉన్నాడే సినిమా( Bhale Unnade )తో వచ్చాడు రాజ్ తరుణ్.

మారుతి ఈ చిత్రానికి కాన్సెప్ట్ అందించడంతో పాటు సమర్పకుడిగా వ్యవహరించడం, ట్రైలర్ కొంత ఆకర్షణీయంగా ఉండడంతో ఇదైనా ప్రేక్షకులను మెప్పిస్తుందేమో అనుకున్నారు.

అయితే అడల్ట్ టచ్ ఉన్న ఈ కాన్సెప్ట్ వినడానికి బాగున్నా ఎగ్జిక్యూషన్ తేలిపోవడంతో ప్రేక్షకులు చివరి వరకు థియేటర్లో కూర్చోలేని పరిస్థితి తలెత్తుతోంది.

రాజ్ గత చిత్రాలతో పోలిస్తే బెటర్ అంటున్నారే తప్ప ఇది కూడా శిరోభారం కలిగించే సినిమానే అని తేల్చేస్తున్నారు.

దీంతో 50 రోజుల వ్యవధిలో రాజ్ ఖాతాలో మూడు డిజాస్టర్లు పడ్డట్లయింది.ఈ స్థితి నుంచి అతనెలా కోలుకుంటాడో చూడాలి మరి.

ఈ దెబ్బతో రాదు తరుణ్ కి సినిమా అవకాశాలు కూడా కరువవుతాయి అని అంటూ కామెంట్ చేస్తున్నారు అభిమానులు.

సినిమా ఇండస్ట్రీ లో మెగా హీరోల పరిస్థితి ఏంటి..?